ఆంధ్ర, తెలంగాణ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు

Heavy Rains in AP and Telanganaతెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల వల్ల అతలాకుతలం అయిన జనజీవన స్రవంతి

ఆంధ్ర, తెలంగాణ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు.

బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల అక్టోబర్ 12  మరియు అక్టోబర్ 13 న తెలుగు రాష్ట్రాలలో కురిసిన అతి భారీ వర్షాల వల్ల జన జీవన స్రవంతి అతలా కుతలం అయింది.

తెలుగు రాష్ట్రాలలో అనేక చోట్ల వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రదేశాలకు  రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు చోట్ల ఇల్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వేల ఎకరాలలో పంట పొలాలు నీట మునిగాయి.

రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. హైదరాబాద్ - విజయవాడ రహదారి పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో అనేక మంది ఈ వరదల వల్ల మృత్యువాత పడ్డారు.

ఒక్క హైదరాబాద్ నగరంలోనే 23 మంది మరణించినట్లు అధికారిక సమాచారం. మరింత మంది మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 14 నుండి 72 గంటల పాటు అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.

Add new comment

2 + 2 =