Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
అంతర్జాతీయ పోలార్ ఎలుగుబంట్ల దినోత్సవం
అంతర్జాతీయ పోలార్ ఎలుగుబంట్ల దినోత్సవం
ఫిబ్రవరి 27వ తేదీన మనం అంతర్జాతీయ పోలార్ ఎలుగుబంట్ల దినోత్సవాన్ని జరుపుకుంటాము.వాతావరణ మార్పులవల్ల పోలార్ ఎలుగుబంట్లు అంతరించి పోవచ్చు అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు .
గ్లోబల్ వార్మింగ్ ప్రభావం పోలార్ ఎలుగుబంట్ల జనాభాపై, తగ్గిన సముద్రపు మంచు ప్రభావం గురించి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ పోలార్ బేర్ దినోత్సవం నిర్వహించబడింది. థర్మోస్టాట్‌ను తగ్గించడం లేదా వాహనాల ఉపయోగం తగ్గించడం ద్వారా కార్బన్ అవుట్‌పుట్‌ను తగ్గించడానికి మార్గాలను కనుగొనమని ఈ రోజు ప్రజలను ప్రోత్సహిస్తుంది.
ప్రస్తుతం, 2050 నాటికి పోలార్ ఎలుగుబంట్ల సంఖ్యా మూడింట రెండు వంతుల కంటే తగ్గుతుందని, మొత్తం సంఖ్యా 10,000 కంటే తక్కువగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ వారు (WWF) " ఆర్కిటిక్ సముద్రపు మంచును దశాబ్దానికి దాదాపు 13% చొప్పున కోల్పోతుంది మరియు గత 30 సంవత్సరాలలో, ఆర్కిటిక్‌లోని అద్భుతమైన పురాతన మంచు 95% క్షీణింస్తుంది" అని తెలియజేసారు.
WWF మరియు యూరోపియన్ ఫెడరేషన్ ఫర్ ట్రేడ్ అండ్ ఎన్విరాన్మెంట్, పోలార్ బేర్స్ ఇంటర్నేషనల్ మొదలైన అనేక ఇతర సంస్థలు ఈ సమస్యపై కొంతకాలంగా పోరాడుతున్నాయి, అయితే ఇంకా ఎక్కువ శ్రద్ధ అవసరం. కాబట్టి ఆకలితో అలమటిస్తున్న ఈ ఎలుగుబంట్లను రక్షించడానికి ప్రపంచమంతా కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది మరియు కార్బన్ ఫుట్ ప్రింట్స్ ను తగ్గించడానికి కొన్ని వినూత్న పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉంది.
ఈ అగ్రశ్రేణి మాంసాహార జంతువులకు మీ మద్దతును తెలియజేయడానికి ఇది సరైన సమయం. వివిధ సంస్థలు మరియు వనరుల నుండి వాటికి సహాయం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి.అయినప్పటికీ మనవంతు కృషిని మనం చేసి ఈ మూగ జీవాలను కాపాడుకుందాం.
Add new comment