హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు

హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురుహృదయం శుద్ధిగా ఉంటే తప్పక దేవుని దర్శించగలం

హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు

గత గురువారం ప్రజలకు తన సందేశంలో ఫ్రాన్సిస్ పాపు గారు అష్టభాగ్యాలలో ఆరవదైన "హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు" అను దానిని గూర్చి ధ్యానించారు.

దేవుని చూడాలంటే హృదయాన్ని శుద్ధి చేసుకొని దానిని పాపము నుండి విముక్తి చెయ్యాలని పాపు గారు చెప్పారు.

పాపు గారి సందేశం (క్లుప్తంగా)

మనం నేడు అష్టభాగ్యాలలో ఆరవదైన దానిని గూర్చి ధ్యానించుకుందాం. హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారని ప్రభువు మనకు వాగ్దానం చేస్తున్నారు. ప్రభువుని చూడడం అంటే ఆయనతో వ్యక్తిగత అనుబంధం కలిగి ఉండడం. మన హృదయాంతరంగాలను పరికించుకొని ఆయనకు స్థానం ఉంచాలి. పునీత అగస్తీను వారు చెప్పినట్లు "నీవు నా అత్యంత ఆంతరంగిక భాగాలలో ఒక భాగానివై ఉన్నావు" అయినా మన హృదయాలు మూర్ఖత్వంతో నిండి, ఎమ్మావు మార్గములో వెళ్తున్న శిష్యుల వలె ప్రభువు మన ప్రక్కన నడుస్తున్నా గుర్తించలేకపోతున్నాము. దేవుని చూడగలగాలి అంటే శుద్దీకరణ చర్య ఆవశ్యకం, దీనివల్ల మన హృదయాలు పాపము నుండి విముక్తి పొంది దేవుని ఉనికిని గ్రహించగలరు.

సాతానును విడచి పవిత్రాత్మ మనలను శాశించి నడిపించే విధంగా ఉండాలి. ఇంకా దేవుని చూడడం అంటే ఈ సృష్టిలోనూ, మన సంఘ్యాలలోనూ, మన తోటి సహోదరి సహోదరులలోనూ, ముఖ్యంగా నిరుపేదలలోనూ, నిర్భాగ్యులలోనూ చూడగలం. మన హృదయాలను శుద్ధి పరచడానికి దేవునికి అర్పిస్తే స్వర్గ రాజ్యంలోని శాంతి సమాధానాలను దేవుడు మనకు చూపిస్తాడు.

ఈ పాస్కా సమయంలో పునరుత్థాన పండుగకు చేరువలో ఉన్నాం. మీ పై మీ కుటుంబాలపై ఆ క్రీస్తుని శాంతి, బలం ప్రోక్షింప బడాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాను. దేవుడు మిమ్ము దీవించు గాక.

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/04/01/pope-francis-explains-beatitude-on-pureness-of-heart/

Add new comment

2 + 3 =