హింసాత్మక సంఘటనలు మన స్వీయ నాశనానికి, స్వీయ ఓటమికి దారితీస్తాయని మనం గుర్తించాలి

Faith of Abrahamఅబ్రాహాముకు దేవుని పై ఉన్న అచంచల విశ్వాసం

హింసాత్మక సంఘటనలు మన స్వీయ నాశనానికి, స్వీయ ఓటమికి దారితీస్తాయని మనం గుర్తించాలి

అపోస్తలిక భవనంలో జరిగిన సామాన్య శ్రోతల సమావేశంలో ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ, అమెరికాలో జార్జ్ ప్లాయిడ్ అనే వ్యక్తి ఒక పొలిసు చేతిలో మరణానికి గురి కావడం, అనంతరం అమెరికాలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు.

ప్రియా స్నేహితులారా, జాతి వివక్ష, అంటరానితనం ఎటువంటి రూపంలో ఉన్నా మనం సహించలేము, ఇంకా ప్రతి మానవుని జీవిత పవిత్రతను కాపాడుతామని చాటుతుంటాము. అదే సమయంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలు మన స్వీయ నాశనానికి, స్వీయ ఓటమికి దారితీస్తాయని మనం గుర్తించాలి అని పాపు గారు గుర్తు చేసారు.

ప్రార్ధనను గూర్చిన తన సత్యోపదేశ సందేశంలో విశ్వానికి తండ్రియైన అబ్రాహామును గూర్చి ధ్యానించారు. ఏ విధంగా అబ్రాహాముకు దేవుని పై ఉన్న అచంచల విశ్వాసం అతనిని ముస్లిములకు, యూదులకు మరియు క్రైస్తవులకు ఒక సుమాతృకను చూపిస్తుందో ధ్యానించారు.

దేవునికి విశ్వాసముతో ప్రార్ధించడం, ఆయనతో ముచ్చటించడం, ఆయనతో తర్కించడం కానీ ఎల్లప్పుడూ తాండ్రి ఆజ్ఞను పాటించడం వంటివి అబ్రాహాము నుండి మనం నేర్చుకోవాలని పాపు గారు అభ్యర్ధించారు.

తండ్రి తో మన బాంధవ్యం బలపడే కొద్దీ మనకు ఆయన పట్ల ఉన్న కోపం కూడా ప్రార్ధనలా మారిపోతుందని పాపు గారు ప్రబోధించారు. 

Add new comment

8 + 8 =