సామజిక మాధ్యమాలలో బోధకులను గూర్చి జాగరూకతతో ఉండండి: పోప్ ఫ్రాన్సిస్

Social Media సామజిక మాధ్యమాలలో బోధ

సామజిక మాధ్యమాలలో బోధకులను గూర్చి జాగరూకతతో ఉండండి: పోప్ ఫ్రాన్సిస్

23 జూన్ 2021 నుండి ఫ్రాన్సిస్ పోప్ గారు పునీత పౌలు గారు గలతీయులకు వ్రాసిన లేఖలను గూర్చి ధ్యానించనున్నారు. దీనిలో భాగంగా స్వతంత్రం, దయ మరియు క్రైస్తవ జీవన విధానం అనే అంశాల గూర్చి ధ్యానించనున్నారు.

"ఈ లేఖలు ఏనాడో వ్రాసినా ఈ రోజులకు ఆ సందేశాలను చక్కగా అన్వయించుకోవచ్చు. పునీత పౌలు గారు ఏదైనా నగరంలోకి సువార్త ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన నేరుగా ఒక దేవాలయాన్ని నిర్మించేవారు కాదు. మొదటగా చిన్న చిన్న సంఘాలను స్థాపించేవారు. ఈ చిన్న సంఘాలు క్రమేపి పెరిగి పెద్ద సంఘాలుగా మారేవి" అని పోప్ గారు గుర్తుచేశారు.

అపొస్తలులు సువార్త ప్రచారం ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తర్వాత యూదా మతం నుండి క్రైస్తవులుగా మారిన మరికొందరు పౌలు గారు ఆపోస్టులుడే కాదని మరియు గలతీయులందరు సున్నతి చేయించుకోవడం తప్పనిసరి అని ప్రచారం చేసారని పోప్ గారు గుర్తుచేశారు.

నేటి సమాజంలో కూడా ఇదే జరుగుతుందని, మరి ముఖ్యంగా సామజిక మాధ్యమాలలో క్రైస్తవత్వాన్ని కాపాడే బోధకులుగా తమను గూర్చి తాము ప్రచారం చేసుకునే వారు ఎక్కువైపోయారు అని పోప్ గారు అభిప్రాయ పడ్డారు.

అటువంటి వారిని ఎలా గుర్తించాలి ? ఉదాహరణకు, వారికి ఉండే గుణగణాలలో కఠినత్వం ముఖ్యమైనది. మనలను విముక్తులను మరియు సంతోషచిత్తులను చెయ్యవలసిన వాక్యాన్ని వారు కఠినత్వంతో బోధిస్తారు. మీరు ఇది చెయ్యాలి, మీరు అది చెయ్యాలి అని కఠినటంగా చెప్తారు. అని పోప్ గారు వివరించారు.

కనుక మనం సామజిక మాధ్యమాలలో వాక్య పరిచర్య చేసే బోధకులను గూర్చి జాగరూకతతో ఉండాలని పోప్ గారు విశ్వాసులకు సందేశం ఇచ్చారు.

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

9 + 0 =