సమాధానం, సంధి తో శాంతి సాధ్యపడుతుంది

మ్రానికొమ్మల ఆదివారంపోప్ ఫ్రాన్సిస్

మ్రానికొమ్మల ఆదివారం నాడు ఫ్రాన్సిస్ పాపు గారి సందేశం కోసం వేలమంది విశ్వాసులు సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్దకు చేరారు.

కరోనా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో  10 ఏప్రిల్ 2022 న గత రెండు సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో విశ్వాసులు పాపు గారి సందేశం కోసం తరలి వచ్చారు.

రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో నేడు క్రీస్తు మరల సిలువకు కొట్టబడుతున్నారు అని పాపు గారు అన్నారు. తమ భర్తలు, పిల్లలు అన్యాయంగా చనిపోయారని రోదించే తల్లుల ఆక్రన్దనలో క్రీస్తు సిలువ పై కొట్టబడుతున్నారు. బాంబుల దాడుల నుండి పారిపోతూ ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్న అమాయకపు తల్లులు వారి చిన్నారుల భయాందోళనలతో క్రీస్తు మరలా సిలువ పై కొట్టబడుతున్నారు. పట్టించుకునేవారులేక మరణానికి వదిలివెయ్యబడ్డ వృద్ధుల కన్నీటిలో క్రీస్తు మరలా సిలువ పై కొట్టబడుతున్నారు. అందమైన భవిష్యత్తును కోల్పోయిన యువతలోను మరియు తమ సహోదరులను చంపడానికి యుద్ధానికి పంపబడుతున్న సైనికుల చర్యల వలన క్రీస్తు నేడు మరలా సిలువ పై కొట్టబడుతున్నారని పాపు గారు అన్నారు.

మనం మన ఆయుధాలను విడిచిపెడదాం. ఆయుధాలను సిద్ధం చెయ్యడం మానేద్దాం. ఉత్తాన క్రీస్తుని సమాధానాన్ని పంచుదాం. శాంతిని స్థాపించే సమాధానాన్ని సంప్రదింపుల ద్వారా తీసుకురావాలి. ప్రజల మంచి కోసం త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. శిధిలాలపై విజయకేతనం ఎగురవేస్తే ఆ విజయానికి అర్ధం ఏముంది? అని పాపు గారు ప్రశ్నించారు.

సమాధానం, సంధి తో శాంతి సాధ్యపడుతుందని పాపు గారు హితవు పలికారు. 

Add new comment

8 + 0 =