సమస్తము నడిపించడానికి విశ్వాసులు పిలువబడ్డారు

Pope FrancisPope Francis

సమస్తము నడిపించడానికి విశ్వాసులు పిలువబడ్డారు

 

ఆదివారం 20 అక్టోబర్ 2019 న కథోలిక సమాజానికి తన సందేశంలో ఆ రోజు అంతర్జాతీయ వేదవ్యాపక ఆదివారం అని గుర్తుచేశారు. సువార్తను ప్రపంచానికి పంచడానికి తమ స్వంత ప్రదేశాలను వాడాలి దూర ప్రాంతాలకు వెళ్లిన వారందరి కోసం ప్రార్ధన చెయ్యాలని పాపు గారు ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని కోరారు.

ప్రపంచంలో ఎక్కడున్నా క్రైస్తవులందరూ తమ విశ్వాస జీవితం అందరికి సాక్ష్యంగా ఉండేలా జీవించాలని ఆయన అభ్యర్ధించారు.

సమస్తము నడిపించడానికి విశ్వాసులు పిలువబడ్డారు. ఒక క్రొత్త ప్రేరణ తో, క్రీస్తుని శుభసందేశం లో పాపము పై దయ, భయము పై నిరీక్షణ, శత్రుత్వము పై సమైక్యత యొక్క విజయం కోసం పాటుపడాలని ఆకాంక్షించారు.

1953 లో బర్మా లో సువార్త సేవకై తన ప్రాణాలను సైతం అర్పించిన అల్ఫ్రెడో  క్రెమోనేసి గారిని పాపు గారు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయనను పునీతునిగా ప్రకటించిన రోజు ఆ రోజేనని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భం గా  ఆయనకు అందరు అభివాదాలు తెలపాలని ఆయన కోరారు.

మనం ధైర్యంగా సహోదర ప్రేమతో వాక్య పరిచర్యకు ఆయనను ఒక ఉదాహరణగా తీసుకోవాలని పాపుగారు సూచించారు.

అనంతరం ఆశ్చర్యకర క్రీస్తు స్వరూపాన్ని రోము నగరంలోని వందలమంది పెరూవియాన్లు ఊరేగింపుగా సెయింట్ పీటర్స్ స్క్వేర్ కు తీసుకొని వచ్చారు. వారు, వారి స్వంత ప్రదేశాలను వీడి సువార్త సేవ చెయ్యడం లో వారి పితరుల ఆచారాన్ని, విశ్వాసాన్ని అనుసరిస్తున్నందుకు పాపుగారు వారికి కృతఙ్ఞతలు చెప్పారు.

జేవియర్ మార్టినెజ్ బ్రోకల్
అనువాదకర్త: అరవింద్ బండి

Add new comment

11 + 3 =