సత్యం ఎప్పుడు స్వచ్ఛముగా , పారదర్శకంగా ఉంటుంది

సత్యం ఎప్పుడు స్వచ్ఛముగా , పారదర్శకంగా ఉంటుందిSaint Stephen

సత్యం ఎప్పుడు స్వచ్ఛముగా , పారదర్శకంగా ఉంటుంది

కాసా మార్త నుండి ప్రజలకు తన సందేశంలో తప్పుడు వార్తలను గూర్చి ప్రస్తావించారు। ఇటువంటి అబద్దపు సమాచారం ఇతరులను ఇబ్బంది పెట్టె విధంగా ఉంటుంది। దీని గూర్చి మనం ఏమి చేయలేకపోవడం ఎంతో బాధాకరం।

నేటి అమరులను గూర్చి ఆలోచించాలని పాపు గారు విశ్వాసులను ఆహ్వానించారు। ఈ రోజులలో న్యాయ నిర్ణేతలకు న్యాయం చేసే అవకాశంకూడా ఉండడంలేదు ఎందుకంటే వీరికి  ఇంతకు మునుపే  తీర్పు చెప్పబడింది। ఆసియ కు చెందిన బీబీ ఉదంతాన్ని ఉదాహరణగా పాపు గారు చెప్పారు। ఆమె మరణాన్ని కోరుకున్న ఒక సంఘం వారు ఏ విధంగా ఆమె పై వదంతులు పుట్టించి ఆమెకు 10 సంవత్సరాల కారాగార శిక్ష పడేలా చేసారో ఆయన గుర్తు చేసారు।

పాపు గారి సందేశం (క్లుప్తంగా)

తన సందేశంలో  అపోస్తులుల కార్యాలనుండి ఒక సన్నివేశాన్ని పాపు గారు ధ్యానించారు.  ఏ విధంగా స్టీఫెన్ గారు ప్రజలు మరియు పెద్దలతో ధైర్యంగా మాట్లాడారు , అందుకు వారు ఏ విధంగా ఆయన పై తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు తీర్పు తీర్చి , నగరం వెలుపలికి ఈడ్చుకొని పోయి రాళ్ల తో  కొట్టారు అనే ఉందంతాన్ని పాపుగారు వివరించారు.

న్యాయాధిపతులు , సిద్ధాంతాలలో స్పష్టతను సహించలేకపోయారు.  ఈ కారణం చేత స్టీఫెన్ గారు దేవునికి , ధర్మానికి వ్యతేరేకంగా బోధిస్తున్నారని ఇతరులచేత చెప్పించారు. క్రీస్తు ప్రభుని విషయంలో కూడా ఇదే జరిగిందని ఆయన దేవునికి వ్యతేరేకంగా భోదిస్తున్నారని తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని పాపుగారు గుర్తు చేసారు.

ఈ నాడు కూడా ఆసియ బిబి వంటి అమరులు ఉన్నారని పాపు గారు గుర్తు చేసారు. తప్పుడు తీర్పు వలన ఆమె ఎన్నో సంవత్సరాలు కారాగారంలో గడపవలసి వచ్చింది. నేడు మనకు ఎన్నో తప్పుడు వార్తలు తెలుస్తున్న తరుణంలో కొన్ని సార్లు మనం ఏమి చెయ్యలేని పరిస్థితి.

కానీ సత్యం ఎప్పుడు స్వచ్ఛముగా , పారదర్శకంగా ఉంటుంది. మన నాలుకలు కూడా ఎన్నో సార్లు చావైనా వ్యాఖ్యలు చేస్తుంది. పుకార్లు నమ్మి ఇతరులను కించపరిచే ప్రవర్తించకుండా  మన నిర్ణయాలలో న్యాయయుక్తంగా ఉండేలా చెయ్యమని ఆ తండ్రిని వేడుకుందాం. 

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/04/28/pope-warns-against-fake-news-that-creates-opinions-and-condemn-innocent-people/

Add new comment

18 + 0 =