శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు

శాంతి స్థాపకులు ధన్యులు

శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు  

 

మంగళవారం సామాన్య ప్రజలకు తన సందేశంలో ఫ్రాన్సిస్ పాపు గారు అష్టభాగ్యాలలో ఏడవదైన "శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు" గురించి ధ్యానించారు.

"సమృద్ధి, నిండైన జీవితం" లోని ఒక శాంతి మరియు "ఆంతరంగిక శాంతి" లోని ఒక శాంతి అని రెండు విధాల శాంతి ఉంటుందని, క్రీస్తు పునరుత్థాన పండుగ ద్వారా ఆయన మరణం, పునరుత్థానంలో మనకు శాంతి ఉందని ఆయన అన్నారు.

క్రీస్తు వాలే ఇతరుల మధ్య సుయోధను తెచ్చి, ఇతరులకోసం తమను తాము త్యాగం చేసుకొనే వారే నిజమైన శాంతి స్థాపకులు అని పాపు గారు చెప్పారు.

పాపు గారి సందేశం (క్లుప్తంగా)

ప్రియమైన సహోదరీ సహోదరులారా

ఈ రోజు మనం "శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు" అను దాని గురించి ధ్యానించుకుందాం.
 
బైబిల్ లో షాలోమ్ అను పదం శాంతికి సూచకం, "సమృద్ధి, చిగురించే జీవం " అని దాని అర్ధం. ఆధునిక సమాజానికి అన్యయించుకుంటే శాంతికి అర్ధం "ఆంతరంగిక శాంతి".  సాధారణంగా మన ప్రశాంతత భగ్నమైనప్పుడే మన ఆత్మీక ఎదుగుదల జరుగుతుంది అందుకే ఈ రెండవ విధమైన శాంతి అసంపూర్తిగా ఉండిపోతుంది. క్రీస్తు తన మరణ, పునరుత్థాన ఫలమైన తన శాంతిని మనకు ఇస్తున్నారు. ఇతరుల బాధ నుండి వచ్చు ఈ ప్రాపంచిక సంతోషంలా కాకుండా, తన వరమైన నిష్కపటమైన సంతోషాన్ని ప్రభువు మనపై ప్రోక్షిస్తున్నారు.

క్రీస్తు వాలే ఇతరుల మధ్య సుయోధను తెచ్చి, ఇతరులకోసం తమను తాము త్యాగం చేసుకొనే వారే నిజమైన శాంతి స్థాపకులు. వారే దేవుని నిజమైన కుమారులు, వారే సంతోషానికి, శాంతికి నిజమైన మార్గాన్ని మనకు చూపిస్తారు.

ప్రపంచంలోని సమస్త క్రైస్తవులకు మరోసారి క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఉత్థాన క్రీస్తుని శాంతి, సమాధానాలు సదా మీకు తోడై ఉండునుగాక, ఆ తండ్రి దేవుని దయ, ప్రేమ, మీపై మీ కుటుంబాలపై సదా ప్రోక్షింపబడునుగాక. ప్రభువు మిమ్ము దీవించునుగాక.

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/04/15/pope-explains-blessed-are-the-peacemakers-in-general-audience/

Add new comment

7 + 9 =