శాంతి స్థాపకులుగా వర్ధిల్లండి - పోప్ ఫ్రాన్సిస్ గారు

శాంతి స్థాపకులుగా వర్ధిల్లండి - పోప్ ఫ్రాన్సిస్ గారు

ప్రతి ఏటా నవంబర్ మాసంలో చివరి వారంలో కతోలిక శ్రీసభ మేత్రాసనస్థాయిలో యువజన దినోత్సవాన్ని కొనియాడుతుంది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని పునీత 2వ జాన్ పాల్ పాపు గారు 1985లో ప్రకటించారు.

నవంబర్ 26న,  38వ  ప్రపంచ యువజన దినోత్సవానికి దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా జగద్గురువులు మహా పూజ్య పోప్ ఫ్రాన్సిస్ గారు యువతను ఉద్దేశించి మంగళవారం ఒక సందేశాన్ని విడుదల చేశారు.

" మీ నిరీక్షణలో ఆనందిప్పుడు"(రోమి 12:12) అన్న వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని తన సందేశాన్ని అందించారు.పోప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ! ప్రస్తుత ప్రపంచం యుద్ధాలు, హింసలు, నిరాశ, స్పృహలతో నిండి ఉన్నదని, అనేకమంది భయం గుప్పెట్లో కాలం వెళ్ళదీస్తున్నారని, అంధకారంలో మగ్గిపోతున్నారని ఇటువంటి తరుణంలో వారి జీవితాలలో వెలుగును, దైవ ప్రేమను వారిలో నింపుతూ, జీవితం పట్ల వారికి ఆశను కల్పిస్తూ, ఆశాజ్యోతిగా వెలుగొందాలని, శాంతిని నింపాలని ఆయన కోరారు.

యువత జీవిత కాలం అనేది  ఆశలు మరియు కలలతో నిండిన కాలం అని , మన జీవితాలను సుసంపన్నం చేసే అనేక అందమైన విషయాలతో  నిండి ఉన్నదని తెలిపారు.  అయినప్పటికీ, ప్రస్తుతం ఈ సంక్షోభం, యుద్ధ కాలంలో  "యువతతో సహా చాలా మంది నిరాశ, స్పృహలతో నిరీక్షణ లేనట్లు జీవిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

కొన్ని దేశాలలో యుక్త వయస్కులు ఆత్మహత్యలు చేసుకోవడం తీవ్ర మనోవేదనను కలిగిస్తున్నదని, యువత నిరాశ నిస్పృహలకు లోను కాకుండా, ప్రార్థనలో ఎక్కువ సమయం   గడపాలని,  దైవ వాక్కును పాటిస్తూ , ధైర్యంగా జీవిస్తూ ముందుకు కదలాలని, అశాంతి అలజడలతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచంలో శాంతిని నింపే శాంతి స్థాపకులుగా యువత వర్ధిల్లాలని, తల్లి మరియమాత దీవెనలు ఎల్లవేళలా యువతపై ఉంటాయని ఆయన అన్నారు.

దేవుడు మనలను అయన  స్వరూపంలో మరియు పోలికలో ఆయన సృష్టించారని  , మనం అతని ప్రేమకు చిహ్నాలుగా ఉండవచ్చు అని , ఇది నిస్సహాయంగా కనిపించే పరిస్థితులలో కూడా ఆనందం మరియు ఆశను కలిగిస్తుంది" అని పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పారు.

 

Add new comment

12 + 3 =