వృద్ధులను 'సున్నితత్వం యొక్క ఉపాధ్యాయులు' అని ప్రశంసించిన ఫ్రాన్సిస్ పాపు గారు

pope francisసున్నితత్వం యొక్క ఉపాధ్యాయులు

రెండవ ప్రపంచ వృద్ధుల దినోత్సవం కోసం ఫ్రాన్సిస్ పాపు గారు తన సందేశంలో వృద్ధుల కోసం ప్రార్థించమని వారిని "సున్నితత్వం యొక్క ఉపాధ్యాయులు" అని సంబోధించారు. 

మన సమాజానికి వృద్ధుల ప్రాముఖ్యతను గుర్తుచేశారు. అందరు వారి కోసం ప్రార్థించాలని మరియు వారి పట్ల మరింత శ్రద్ధ వహించాలని ఆయన ఉద్బోధించారు.

వృద్ధులమైన మేము తరచుగా సంరక్షణ మరియు ఆప్యాయత కోసం ప్రత్యేక సున్నితత్వాన్ని కలిగి ఉంటాము" అని పాపు గారు చెప్పారు. సమాజానికి అందించడానికి వారి వద్ద అనేక బహుమతులు కూడా ఉన్నాయి.

"వృద్ధుల కోసం మనం ప్రార్థిద్దాం, వారు సున్నితత్వానికి ఉపాధ్యాయులుగా మారవచ్చు, తద్వారా వారి అనుభవం మరియు జ్ఞానం యువతకు ఆశ మరియు బాధ్యతతో భవిష్యత్తు వైపు చూసేందుకు సహాయపడతాయి" అని ఆయన చెప్పారు.

సంఘర్షణతో నిండిన మన ప్రపంచానికి "సున్నితత్వం యొక్క నిజమైన విప్లవం" అవసరమని మరియు వృద్ధులు సమాజం యొక్క కఠినత్వాన్ని కొంత  తగ్గించడంలో సహాయపడతారని కూడా అతను పేర్కొన్నారు.

వృద్ధుల దీర్ఘాయువు కోసం ప్రార్థించాలని విశ్వాసులందరిని , తద్వారా వారి అనుభవం మరియు జ్ఞానం యువతను ఆశావాదంతో మరియు బాధ్యతతో భవిష్యత్తు వైపు చూసేలా ప్రేరేపించగలవు.

"సమాజం మరియు మన సమాజ జీవితంలో వృద్ధుల ప్రాముఖ్యత" గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ విశ్వాసులను కోరారు.

2022లో ప్రపంచ వృద్ధుల దినోత్సవం జూలై 24 న జరగబోతుంది. ఈ సంవత్సరం ఉద్దిష్టం "వృద్ధాప్యంలో వారు ఇంకా ఫలాలు అందుకుంటారు"
 

Add new comment

8 + 3 =