వృద్ధాప్యం జీవితం యొక్క "ప్రారంభం" - పోప్ ఫ్రాన్సిస్

వృద్ధాప్యంపోప్ ఫ్రాన్సిస్

ఆగష్టు 10 బుధవారం నాడు ఫ్రాన్సిస్ పాపు గారు విశ్వాసులకు తన సత్యోపదేశ సందేశాన్ని ఇచ్చారు. కెనడా పర్యటనకు ముందు వృద్ధాప్యం మరియు వృద్ధుల విలువ గురించి విసరణను ప్రారంభించిన పాపు గారు అదే అంశంతో తన సందేశాన్ని కొనసాగించారు.

వృద్ధాప్యం అనేది నిరీక్షణ యొక్క సంతోషకరమైన మరియు సజీవ సాక్ష్యానికి మంచి సమయం. వృద్ధులు సమావేశం కోసం ఎదురుచూసే స్థితిలో ఉంటారు. జీవిత గమ్యం ఏమిటి? దేవుని బల్ల వద్ద, దేవుని ప్రపంచంలో ఒక స్థానం. దేవునితో ఆ సమావేశానికి వారు ఎదురు చూస్తూ ఉంటారు అని పాపు గారు అన్నారు.

తప్పిపోయిన అవకాశాల గురించి నిరుత్సాహపడే వృద్ధాప్యం తనకు మరియు సమాజానికి నిస్సహాయతను కలిగిస్తుందని, అయితే మృదుత్వం మరియు జీవితం పట్ల గౌరవంతో జీవించే వృద్ధాప్యం ప్రాపంచికత కోసం ప్రలోభాలను తొలగిస్తుందని పాపు గారు చెప్పారు.

ఆ దిశగా, స్థానిక చర్చిలు వృద్ధుల పరిచర్యను ప్రోత్సహించాలని ఆయన కోరారు. తద్వారా వారు  భూసంబంధమైన జీవితాల తర్వాత దేవునితో ఐక్యం కావడానికి ఆశాజనకంగా వేచి ఉంటారని, దానిని జీవితం యొక్క "ప్రారంభం" అని పాపు గారు అభివర్ణించారు.

వృద్ధాప్యానికి సమయం మరియు మనం నివసించే స్థలం యొక్క పరిమితులు ఖచ్చితంగా తెలుసు. ఈ కారణంగా వృద్ధాప్యం తెలివైనది, కనుక వృద్ధులు తెలివైనవారు అని పాపు గారు అభిప్రాయపడ్డారు.

పాపు గారి ప్రకారం, వృద్ధాప్యం అనేది మెచ్చుకోదగినది మరియు ఆర్భాటాలు అవసరం లేదు. ఇది ఆనందంగా జీవించడానికి ఒక నిర్దిష్ట మార్గాన్ని కూడా తీసుకువస్తుంది, ఎందుకంటే వృద్ధులకు గడిచే ప్రతి క్షణం దేవునికి దగ్గరవ్వమే.

అవును, సమయం గడిచిపోతుంది, కానీ అది ముప్పు కాదు. అది దేవుని వాగ్దానం వాగ్దానం.

పాపు గారు మరోసారి ఉక్రెయిన్‌లో శాంతి కోసం పిలుపునిచ్చారు మరియు అనువాదకుల ద్వారా హాజరైన యాత్రికుల వివిధ సమూహాలను అభినందించారు.

కాలాన్ని ఆపడం, లేదా శాశ్వతమైన యవ్వనం, అపరిమిత సంపద, సంపూర్ణ శక్తి కోరుకోవడం అసాధ్యం మాత్రమే కాదు, అది ఒక భ్రమ అని ఆయన హితవు పలికారు.

Add new comment

3 + 5 =