విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్ధించడం నేర్చుకోవాలి: ఫ్రాన్సిస్ పాపు గారు

Power of prayerPower of prayer

విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్ధించడం నేర్చుకోవాలి: ఫ్రాన్సిస్ పాపు గారు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో మనం మరింత విశ్వాసంతోను, పట్టుదలతోనూ, ధైర్యంతోనూ ప్రార్ధించాలని ఫ్రాన్సిస్ పాపు గారు సోమవారం నాడు కాసా మార్త లో తన సందేశంలో అన్నారు.

విశ్వాసం ఉంటే పట్టుదల ఉంటుంది. మనకు విశ్వాసం ఉంటే మనం అడిగింది దేవుడు దయచేస్తాడని నమ్మకం ఉంటుంది. ఒక వేళ నువ్వు నిరీక్షించవలసి వస్తే, దేవునికి దయ కలిగే వరకు ఆయన ద్వారం వద్ద నిలిచి ఆ ద్వారాన్ని తడుతూనే ఉండాలి. మనల్ని నిరీక్షింపచేసాడంటే దేవునికి అది ఆనందం కలిగిస్తుందని కాదు, ఆ నిరీక్షణ వల్ల మనకు ఇంకా గొప్ప బహుమానం ఉందని అర్ధం. ఆ నిరీక్షణవల్ల మనం విషయాలను శ్రద్దగా పరికిస్తాము.

విశ్వాసం తో ఎలా ప్రార్ధించాలో క్రైస్తవులందరూ పునరాలోచించాలని పాపు గారు క్రైస్తవ సమాజాన్ని కోరారు. దేవుడు మనల్ని నిరాశపరచరని ఆయన అన్నారు.

పాపు గారి సందేశం క్లుప్తంగా

చాలా సార్లు మన ప్రార్ధన నోటినుండి మాత్రమే కానీ మనస్సు నుండి రావడంలేదు ఇది మన అల్ప విశ్వాసానికి నిదర్శనం.
విశ్వాసము, ప్రార్ధన.... మనం విశ్వాసంతో ప్రార్ధిస్తున్నామా లేక అలవాటుగా ప్రార్దిస్తున్నామా అని పునరాలోచించుకోవాలి. ప్రార్ధన అలవాటుగా కాక విశ్వాసంతో చెయ్యాలి.

కొందరు దేవుని అడుగుతారు కానీ ఆ దేవుని కృప వారికి దక్కదు. ఎందుకంటే వారికి ఆ పట్టుదల ఉండదు. వారి హృదయాంతరంగాలలో నిజమైన విశ్వాసం ఉండదు.

విశ్వాసం ఉంటే పట్టుదల ఉంటుంది. మనకు విశ్వాసం ఉంటే మనం అడిగింది దేవుడు దయచేస్తాడని నమ్మకం ఉంటుంది. ఒక వేళ నువ్వు నిరీక్షించవలసి వస్తే, దేవునికి దయ కలిగే వరకు ఆయన ద్వారం వద్ద నిలిచి ఆ ద్వారాన్ని తడుతూనే ఉండాలి. మనల్ని నిరీక్షింపచేసాడంటే దేవునికి అది ఆనందం కలిగిస్తుందని కాదు, ఆ నిరీక్షణ వల్ల మనకు ఇంకా గొప్ప బహుమానం ఉందని అర్ధం. ఆ నిరీక్షణవల్ల మనం విషయాలను శ్రద్దగా పరికిస్తాము.

ప్రార్థనకు ధైర్యం అవసరమా? దేవుని ముందు నిలువడానికి ధైర్యం అవసరమే. ఒక విధంగా చెప్పాలంటే దేవుని కూడా సవాలు చేసే అంత ధైర్యం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేస్తానని యావే చెప్పినప్పుడు వద్దని చెప్పడానికి మోషే చూపిన ధైర్యం. సోదోము పట్టణాన్ని నాశనం చేసే విషయంలో అబ్రాహాము దేవుని బేరమాడిన  తీరులోని ధైర్యం మన ప్రార్ధనలో ఉండాలి.

నేటి పరిస్థితుల రీత్యా మన ప్రార్ధనలో విశ్వాసము, పట్టుదల, ధైర్యము తప్పనిసరిగా ఉండాలి. మన ప్రార్థనలను ప్రభువు నిరాధారం చెయ్యడు. మన ప్రార్థనకు సమాధానం ఆలస్యం కావచ్చు. ప్రభువు నుండి జవాబు కోసం మనం నిరీక్షించాల్సి రావచ్చు. కానీ పట్టు విడువకుండా ప్రార్ధించడం, అవసరమైతే ధైర్యాన్ని చూపించడం కూడా మనకు తెలియాలి.

మనందరం కూడా పరిపూర్ణ విశ్వాసంతో పట్టుదలతో ప్రార్ధించడం నేర్చుకోవాలి. పాపు గారు సూచించినట్లు దేవునితో ధైరంగా సంభాషించే స్థాయికి మన ప్రార్ధన చేరాలని కోరుకుందాం

Add new comment

4 + 2 =