వివాహం అనేది ఎంతో కష్టంతో కూడిన సంక్లిష్టమైన ఒక నిబద్దత: పోప్ ఫ్రాన్సిస్

Marriageపోప్ ఫ్రాన్సిస్

వివాహం అనేది ఎంతో కష్టంతో కూడిన సంక్లిష్టమైన ఒక నిబద్దత: పోప్ ఫ్రాన్సిస్

మే 1 న ఫ్రాన్సిస్ పోప్ గారు ప్రజలకు ఇచ్చిన వీడియో సందేశంలో వివాహములోని సౌందర్యాన్ని గురించి వివరించారు. ఈ తరం యువకులు వివాహం పట్ల విముఖత చూపడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు.  

వివాహం అనేది ఎంతో కష్టంతో కూడిన సంక్లిష్టమైన ఒక నిబద్దత. కానీ అది ఒక ఆవశ్యకమైన నిబద్దత అని పోప్ గారు వివాహాన్ని గురించి అభివర్ణించారు.

వివాహం అనేది వట్టి  సాంఘిక క్రియ మాత్రమే కాదు, అది ప్రేమను గూర్చిన దేవుని స్వప్నాన్ని మనదిగా మార్చుకునే ఒక వృత్తి వంటిది. దానికి ఎంతో సంసిద్ధత అవసరం అని పోప్ గారు అన్నారు.

కనుక వివాహానికి సన్నద్దమౌతున్న వారి కోసం మనందరం ప్రార్ధించాలని పోప్ గారు కోరుతున్నారు ఎందుకంటే ఒక జంట కలిసి జీవనం సాగించాలంటే వారి మధ్య ప్రేమ ఎంతో ఆవశ్యకం అని పోప్ గారు హితవు పలికారు.

 

Article by

Arvind Bandi.

Online Producer

Add new comment

4 + 0 =