విలేఖరులు లేరా? ఐతే నేను స్వేచ్ఛగా మాట్లాడవచ్చు: ఇటలీ పీఠాధిపతుల సమాఖ్య లో పోప్ ఫ్రాన్సిస్

Italian bishops conference ఇటలీ పీఠాధిపతుల సమాఖ్య

విలేఖరులు లేరా? ఐతే నేను స్వేచ్ఛగా మాట్లాడవచ్చు: ఇటలీ పీఠాధిపతుల సమాఖ్య లో పోప్ ఫ్రాన్సిస్ 

కరోనా కారణంగా ఇటలీ పీఠాధిపతుల సమాఖ్య గత రెండు సంవత్సరాల నుండి సమావేశం కానందున 74 వ ఇటలీ పీఠాధిపతుల సామాన్య సమావేశం ఈ నెల 24 న వాటికన్ లోని ఒక హోటల్ లో జరిగింది. గత సమావేశాలని ఫ్రాన్సిస్ పోప్ గారి నివాసంలో జరగగా దీనికి భిన్నంగా ఈ సమావేశాన్ని ఒక హోటల్ లో నిర్వహించారు. 

తన సందేశానికి ముందు ఫ్రాన్సిస్ పోప్ గారు ఈ సమావేశానికి పాత్రికేయులు రానందున తాను స్వేచ్చగా మాట్లాడవచ్చని తన సహజ పద్దతిలో చలోక్తులు విసిరారు.

సమావేశాన్ని ప్రారంభిస్తూ, తాను ముఖ్యంగా మూడు విభాగాలను గూర్చి ద్రుష్టి సారించి చర్చించాలని ఆశ పడుతున్నట్లుగా చెప్పారు. 

మొదటిది, కథోలిక మతపరమైన ధర్మములలో జరిగి సంస్కరణలు, రెండవది సెమినరీలు, మూడవది మతపరమైన విషయాలు 

కథోలిక మతపరమైన ధర్మాలను కాపాడడంలో ఎంతో మంచి పురోగతి సాధించామని, అందుకు తాను ఎంతో సంతోషిస్తున్నట్లు పోప్ గారు తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. కాగా ఈ రోజులలో సెమినరీలు ఎంతో దీన స్థితిలో ఉన్నాయని, దైవసేవకు అంకితమౌతామని వస్తున్న యువకులలో ఎక్కువ శాతం మంది మంచి వారు మరియు సేవ యందు దృఢత్వం కలిగినవారిలా  కనిపించినా తర్వాత వారు అతి కష్టమైన సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందని పోప్ గారు అన్నారు.

ప్రాధమిక స్థాయి నుండి సినడ్ పని చెయ్యాలని ఫ్రాన్సిస్ పోప్ గారు సూచించారు. చిన్న చిన్న సంఘాలనుండి చిన్న విచారణలు వరకు పని చెయ్యాలని, దానికి చాల పరిశ్రమ కావాలని, చాల కష్టపడాలి అప్పుడే దేవుని జ్ఞానం మన ద్వారా బహిర్గతమౌతుందని అని ఆయన సూచించారు.

రానున్న నెలలలో ఇటలీ పీఠాధిపతులు జాతీయ సినడ్ ను ఏర్పాటు చేసుకుంటారని సమాచారం.
 

Add new comment

5 + 8 =