విగ్రహారాధక ప్రేరణను గూర్చి జాగరూకత కలిగి ఉండాలి

idolatrous temptationవిగ్రహారాధక ప్రేరణను గూర్చి ఫ్రాన్సిస్ పాపు గారు

విగ్రహారాధక ప్రేరణను గూర్చి జాగరూకత కలిగి ఉండాలి

ఆగష్టు నెలలో మొదటి ఆదివారమైన  1 ఆగష్టు 2021 న ఫ్రాన్సిస్ పాపు గారు విశ్వాసులకు తన సందేశాన్ని అందించారు. ఈ సందేశంలో పాపుగారు క్రైస్తవులందరూ "విగ్రహారాధక ప్రేరణ" ను గూర్చి జాగరూకత కలిగి ఉండాలని హెచ్చరించారు.

"ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని ప్రార్ధించడం, స్వలాభం కోసం మాత్రమే దేవుని ప్రార్ధించడం వంటివి  కూడా విగ్రహారాధనతో సమానమే. ఈ విగ్రహారాధక ప్రేరణ వల్ల మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుని ప్రార్థిస్తాం కానీ ఆ  ఆపద సమసిపోయినప్పుడు మనకు దేవుడు గుర్తుకు రాడు. ఇటువంటి శోధన వల్ల మన విశ్వాసం దృఢత్వాన్ని కోల్పోతుంది. " అని పాపు గారు బోధించారు.

"క్రీస్తును మన జీవితాలలోకి ఆహ్వానించడం ద్వారా మన విశ్వాసం దృఢపడి, స్వలాభ దృష్టిని విడిచి పెట్టగలం. దేవుడు మనతో ప్రేమపూర్వక బంధం కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. మనం ప్రతినిత్యం ఆయనను ప్రేమిస్తూనే ఉండాలి. దేవునితో అనుబంధం అన్నిటికంటే అతీతమైనది, అంచనాలు అందనిది " అని పాపు గారు అభివర్ణించారు.

ప్రార్ధన ముగిసిన అనంతరం పాపు గారిని సందర్శించడానికి వచ్చిన విశ్వాసులలో పెరు దేశం నుండి వచ్చిన కొందరిని పాపు గారు గమనించి, వారి దేశానికి నూతన అధ్యక్షుడు లభించినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు. దేవుడు ఎల్లప్పుడూ వారి దేశాన్ని, ప్రజలను కాపాడాలని పాపు గారు అభిలషించారు. 

 

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

15 + 5 =