వసుదైక కుటుంబం కోసం ప్రతిఒక్కరు వారికి తోచిన విధంగా సహకరించాలి

వసుదైక కుటుంబంధరిత్రి దినోత్సవ 50 వ  వార్షికోత్సవ సందేశం

వసుదైక కుటుంబం కోసం ప్రతిఒక్కరు వారికి తోచిన విధంగా సహకరించాలి

ధరిత్రి దినోత్సవ 50 వ  వార్షికోత్సవ సందర్భంగా ప్రజలకు తన సందేశంలో ఫ్రాన్సిస్ పాపు గారు వసుదైక కుటుంబం కోసం ప్రతిఒక్కరు వారికి తోచిన విధంగా సహకరించాలని కోరారు.

కరోనా వంటి మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో ప్రజలందరూ సంఘీభావంతో మరియు ఐక్యతతో వ్యవహరిస్తే సులభంగా దానిని అరికట్టవచ్చని ఆయన అన్నారు.

పాపు గారి సందేశం (క్లుప్తంగా)

ప్రియమైన సహోదరి సహోదరులారా

నేడు ధరిత్రి దినోత్సవ 50 వ వార్షికోత్సవం. వసుదైక కుటుంబానికి ప్రతిఒక్కరు తమవంతు సహకారం అందించడానికి ప్రతిజ్ఞ చెయ్యాలి. ప్రపంచంలోని సమస్త ప్రాణులను సంరక్షించుకోవటం మనందరి భాద్యత. ఈ ప్రపంచం మన ఐక్యతకు సోపానం కావలి కానీ విడిపోవడానికి కాదు. ఈ ధరిత్రి పట్ల మనకు గల గౌరవాన్ని తిరిగి నూతనంగా చేసుకొని, స్వార్ధ బుద్ధిని వదులుకోవడానికి ఈ ధాత్రిని ఒక క్రొత్త దృక్పధంతో చూడాలి ఎందుకంటే ఈ భూమిని కూడా సృజించినది దేవుడే కనుక ఈ భూమి కూడా పవిత్రమైనదే.

ఈ భూమిపై బాటసారులలాంటి మనం మనకు బహుమానంలా ఇవ్వబడిన ఈ భూమిపై వచ్చిన కరోనా వంటి ఈ మహమ్మారులను సంఘీభావంతోను ఐక్యతతోను ఎదురుకోవాలి. లావుదా తోసి లో మనం గుర్తుచేసుకున్నట్లు మనందరం ఒకరి పై ఒకరు ఆధార పది జీవించే మానవులం కనుక ఇటువంటి సమయాలలో అందరం కలిసి పోరాడాలి.

ఈ ఈస్టర్ కాలంలో మనందరి ఇల్లువంటి భూమిని, మన సహోదరి సహోదరులను మరి ముఖ్యంగా అవసరతలో ఉన్నవారిని ఎక్కువగా ప్రేమించే ఈ సమయంలో మన పరలోకపు తండ్రిని "ఓ తండ్రి, మీ పవిత్రాత్మను పంపండి, ఈ ధాత్రిని నూతన పరచండి" అని వేడుకోవాలి.

ఉత్థాన క్రీస్తుని ఆనందంలో మీ పై మీ కుటుంబాలపై ఆ ప్రేమ తండ్రి దయ ప్రోక్షింపబడును గాక. ఆమెన్ 

 

Article abstracted from : https://www.romereports.com/en/2020/04/22/popes-message-on-earth-day-pandemic-teaches-unity/

Add new comment

1 + 11 =