వయోవృద్ధులను వారి పాటికి వారిని వదిలివెయ్యకండి: ఫ్రాన్సిస్ పాపు గారు

Oldageచాలా మంది ముసలివారు తమ ఆప్తుల వద్దనుండి పలకరింపుకు కూడా నోచుకో లేక పోతున్నారు

వయోవృద్ధులను వారి పాటికి వారిని వదిలివెయ్యకండి: ఫ్రాన్సిస్ పాపు గారు 

 

జులై 27 న క్రీస్తు ప్రభుని ఇహలోకపు తాత, అమ్మమ్మ గార్లైన పునీత జ్వాకీము మరియు అన్నమ్మ గార్ల పండుగను పురస్కరించుకొని నేటి పరిస్థితులలో ముసలివారు అనుభవిస్తున్న ఒంటరితనాన్ని ఫ్రాన్సిస్ పాపు గారు గుర్తుచేశారు. మరిముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వల్ల చాల మంది ముసలివారు తమ  ఆప్తుల వద్దనుండి  పలకరింపుకు కూడా నోచుకో లేక పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

అపోస్తలిక భవనం నుండి పాపు గారు యువకులకు తన సందేశాన్ని అందించారు.

వారి పాటికి వారిని వదిలివెయ్యకండి. మీ ప్రేమను వారికి చూపించండి, వారికి ఫోన్ చేసి వారితో మాట్లాడండి, వీడియో కాల్స్ చెయ్యండి, కుదిరితే ఒక సారి వారిని కలవండి, ఎందుకంటే వారే మన పునాదులు. అని పాపు గారు అన్నారు.

డోన్ బాస్ ప్రాంతంలో కాల్పుల విరమణకు ఒక ఒప్పందానికి వచ్చిన రష్యా మరియు యుక్రెయిన్ దేశాలు నిర్ణయాన్ని పాపు గారు ఆహ్వానించారు.

ఇరు దేశాలు ఒప్పందానికి కట్టుబడి ఉండి, ఆయుధాలను వాడాలి శాంతిగా మెలగాలని ప్రార్ధిస్తున్నాను. విశ్వాసాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇదొక్కటే మార్గం. అని ఆయన అభిప్రాయపడ్డారు.

తన పర్యాటక మాసమైన జులై మాసంలో పాపు గారు తన పర్యటనలు పూర్తిగా నిషేదించుకున్నారు. ఒక్క ఆదివారం మాత్రమే విశ్వాసులకు సందేశాలు ఇస్తున్నారు.

కరోనా వల్ల వాటికన్ నగరానికి సందర్శకుల తాకిడి కూడా గణనీయంగా తగ్గింది.

Add new comment

9 + 10 =