లెబనాన్ లోని విస్ఫోటనంలో మరణించిన వారికోసం ప్రార్ధించిన ఫ్రాన్సిస్ పాపు గారు 

Lebanon disaster ఈ విపత్కర సమయంలో విశ్వాసం, నిరీక్షణ మరియు దయాగుణం కలిగి ఉండాలి: ఫ్రాన్సిస్ పాపు గారు

లెబనాన్ లోని విస్ఫోటనంలో మరణించిన వారికోసం ప్రార్ధించిన ఫ్రాన్సిస్ పాపు గారు 

 

జులై మాసంలో విశ్రాంతి తీసికున్న అనంతరం పాపు గారు ఆగష్టు మాసం నుండి ప్రజలకు సందేశాలు ఇవ్వడం ప్రారంభించారు. కరోనా వల్ల తీసుకుంటున్న జాగ్రత్త చర్యల దృష్ట్యా, పాపు గారు అపోస్తలిక భవనంలోని గ్రంధాలయం నుండే ప్రజలకు తన సందేశాన్ని అందించారు.

లెబనాన్ లో జులై 4 న జరిగిన భారీ విస్ఫోటనం అనంతర పరిణామాలను గూర్చి పాపు గారు మాట్లాడారు.

"నిన్న  బెయిర్ట్ నగరం లో జరిగిన శక్తివంతమైన భారీ విస్ఫోటనం అనేకమంది మరణానికి, వేల మంది గాయాల పాలవడానికి మరియు అపారమైన విధ్వంసం జరగడానికి కారణమయింది. బాధితుల కొరకు మరియు వారి కుటుంబాల కొరకు మనం ప్రార్ధిద్దాం. ఈ సాంఘిక మరియు ఆర్ధిక సంక్షోభాన్ని ప్రపంచ దేశాల సహాయంతో మరియు వారి స్వంత ఆలోచనతో ఎదుర్కోవడానికి లెబనాన్ దేశానికీ శక్తిని దయచెయ్యమని మనం ప్రార్ధించాలి" అని పాపు గారు కోరారు.

తన సత్యోపదేశ సందేశంలో ఈ కరోనా మహమ్మారి ఇంకా కొంత కాలం రాజ్యం చేస్తుందని, మరిన్ని విపరీత పరిణామాలకు దారి తీస్తుందని ఆయన గుర్తు చేసారు.

మన బలహీనతలను బట్టబయలు చేస్తూ ఈ మహమ్మారి మనల్ని మరింత గాయపరచనుంది. ప్రపంచంలోని అన్ని ఖండాలలో అనేకమంది మరణించారు, అనేకులు వ్యాధిగ్రస్తులు అయ్యారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఎన్నో కుటుంబాలు అనిశ్చిత స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ముఖ్యంగా ఆర్ధికంగా వెనుక బడిన వారు బాగా దెబ్బ తిన్నారు" అని పాపు గారు అన్నారు.

అందువలన ఆత్మను, శరీరాన్ని స్వస్థ పరచు క్రీస్తులో నమ్మకం ఉంచాలని ఆయన విశ్వాసులకు పిలుపునిచ్చారు. క్రీస్తు ప్రభువును మాతృక గా తీసుకొని సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని ఆయన హితవు పలికారు.

ఈ విపత్కర సమయంలో విశ్వాసం, నిరీక్షణ మరియు దయాగుణం కలిగి ఉండాలని ఆయన ప్రపంచం లోని కథోలిక విశ్వాసులందరిని కోరారు. 
 

Add new comment

2 + 10 =