లెట్ అజ్ డ్రీమ్ ది పాత్ టు ఫ్యూచర్'

చైనా అనుసరిస్తున్న తీరుపై  పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు :

'లెట్ అజ్ డ్రీమ్ ది పాత్ టు ఫ్యూచర్'(Let Us Dream: The Path to a Better Future) అనే పుస్తకాన్ని పోప్ ఫ్రాన్సిస్ రచించారు. ఇందులో రోహింగ్యాల గురించి, చైనాలో అణచివేతకు గురవుతున్న ఉయిఘర్ ముస్లింల గురించి, పాకిస్థాన్ లో అణచివేయబడుతున్న యుజైదీల గురించి ఫ్రాన్సిస్ ప్రస్తావించారు.

కొంతకాలంగా చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ దేశాధినేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. భారత్ తో చీటికి మాటికి గొడవ పెట్టుకుంటుంది. నియంత్రుత్వానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న చైనాలో. క్రైస్తువులు,ముస్లింల  స్వేచ్ఛను చైనా అణచివేస్తుంది. ఇదే విషయమై ప్రముఖ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ చైనాపై మండిపడ్డారు. డ్రాగన్ దేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

చైనా అనుసరిస్తున్న సరైనది కాదని, చైనాలో ఉఘయిర్ ముస్లింలపై ఆ దేశంలో అణచివేతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉఘయిర్ ముస్లింలను చైనా అణచివేస్తుందని ఆయన మండిపడ్డారు.
చైనాలో తీవ్ర నిర్బంధంలో కాలం వెల్లదీస్తున్న వీరిని గురించి తాను నిరంతరం ఆవేదన చెందుతానని పోప్ రాసుకొచ్చారు. ఉఘయిర్ ముస్లింలను చైనా అత్యంత దారుణంగా అణచివేయడం తనను కలవరపరుస్తుందని రాసుకొచ్చారు. అంతేగాక ఇస్లామిక్ దేశాలలో అణచివేతకు గురవుతున్న క్రిస్టియన్ల దుర్భర జీవితాలను చూసినప్పుడల్లా తనకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు.

Add new comment

6 + 0 =