యువకులు తమ జీవితాలలో దేవుని మొదటి స్థానంలో ఉంచాలి: పోప్ ఫ్రాన్సిస్

Carloయువకులందరు పరిశుద్ధ కార్లో గారిని ఆదర్శంగా తీసుకోవాలి

యువకులు తమ జీవితాలలో దేవుని మొదటి స్థానంలో ఉంచాలి: పోప్ ఫ్రాన్సిస్

యువకులందరు పరిశుద్ధ కార్లో అక్యూటీస్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని ఫ్రాన్సిస్ పోప్ గారు తన సందేశంలో యువకులccను కోరారు.

యువకులు తమ జీవితాలలో దేవుని మొదటి స్థానంలో ఉంచి తమ తోటి సహోదరి సహోదరులకు సహాయం చెయ్యాలనే సందేశానికి పరిశుద్ధ కార్లో జీవితం ఒక గొప్ప సాక్ష్యం అని పోప్ గారు అన్నారు.

అర్మేనియా మరియు అజర్బేజాన్ దేశాల మధ్య మాస్కో లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కొన్ని గంటలలోనే ఉల్లంఘించడాన్ని పోప్ గారు ప్రతిఘటించారు.

ఇక్కడ సంధి అనేది ఎంతో పెళుసైనది అయినా సంధి కోసం మరల ప్రయత్నించాలని నా ఆకాంక్ష. యుద్ధం లో తమ ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

"ఎయిడ్ టు ది చర్చి ఇన్ నీడ్" సంస్థ వారు అక్టోబర్ 18 న జరుపబోతున్న "ఒక మిలియన్ చిన్నారుల జపమాల ప్రార్ధన" కార్యక్రమం నిరాటంకంగా జరగాలని దాని కోసం అందరు ప్రార్ధించాలని పోప్ గారు విశ్వాసులను కోరారు.

కరోనా వలన ఉత్పన్నమైన దారుణ పరిస్థితులు సర్దుకోవాలని ప్రపంచం నలుమూలల నుండి చిన్నారులు జపమాలను జపించబోతున్నారు. ఈ సుందరమైన కార్యక్రమము సఫలీకృతం కావాలని ప్రార్ధిద్దాం అని ఆయన అన్నారు.

"సామాన్య విశ్వాసులు, ముఖ్యంగా స్త్రీలు దైవ కార్యక్రమాలలో పాల్గొనాలని" తన అక్టోబర్ మాస ప్రార్ధనా ఉద్దిష్టంగా పోప్ గారు వెల్లడించారు. దాని కొరకై విశ్వాసులందరు తప్పక ప్రార్ధించాలని ఆయన కోరారు.

 

Arvind Bandi

Online Content Producer

Radio Veritas Asia Telugu

Add new comment

2 + 15 =