యుద్ధానికి ముగింపు పలికి శాంతిని స్థాపించండి- పోప్ ఫ్రాన్సిస్ గారు

యుద్ధానికి ముగింపు పలికి శాంతిని స్థాపించండి-  పోప్ ఫ్రాన్సిస్ గారు

మహా పూజ్య  పోప్ ఫ్రాన్సిస్ గారు  ఆదివారం నాడు  త్రికాల జపముల అనంతరం  ఇచ్చిన సందేశంలో  "ఇజ్రాయెల్ మరియు పాలస్తీనియన్" ల మధ్య శత్రుత్వానికి ముగింపు పలకాలని ఆ రెండు దేశాలను కోరారు.

ఈ సందర్భముగా మహా పూజ్య  పోప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ " ఈ యుద్ధం గురించి వార్తలు వింటుంటే  మనసుకు తీవ్ర బాధ మరియు  ఆందోళన కలుగుతుందని, హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిపించాలని  విజ్ఞప్తి చేశారు. యుద్ధం వల్ల గాజా తీవ్రంగా గాయపడిందని,గాజాకు స్నేహ హస్తాన్ని అందించవలసిందిగా ఆయన అంతర్జాతీయ సమాజాన్ని పోప్ ఫ్రాన్సిస్ గారు కోరారు.

యుద్ధాలు అన్నిటికీ పరిష్కారాన్ని చూపవని అవి వినాశనానికి దారితీస్తాయని ఇప్పటికైనా ఆయుధాలను విడనాడి, శాంతి చర్చల ద్వారా సమస్యకు ముగింపు పలికి , ప్రభు యేసు చూపిన ప్రేమ మార్గంలో  ముందుకు నడవాలని ఆయన ఇరుదేశాలకు విజ్ఞప్తి చేశారు.  నా ప్రార్థన సహాయం ఎల్లవేళలా ఉంటుందని ఈ సందర్భముగా పోప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు.

Add new comment

2 + 3 =