Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
మ్రానికొమ్మల ఆదివారం: పాపు గారి సందేశం
మ్రానికొమ్మల ఆదివారం: పాపు గారి సందేశం
అతి కొద్దిమంది పాల్గొన్న మ్రాని కొమ్మల ఆదివారం పూజ బలిలో ఫ్రాన్సిస్ పాపుగారు
క్రీస్తుని సిలువ శ్రమలను గూర్చి ధ్యానించారు. జీవితంలో కష్టాలను ఎలా ఎదుర్కోవాలో క్రీస్తు శ్రమలు ద్వారా మనకి తెలుస్తుందని అయన అన్నారు.
"భయపడకండి, మీరు ఒంటరి వారు కారు. మీకు దగ్గరగా ఉండుటకు, మీకు తోడుగా ఉండుటకే నేను ఈ ఒంటరితనాన్ని భరించాను. అని క్రీస్తు ప్రభువు మనతో చెప్తున్నారు. మహమ్మారి ప్రభలుతున్న ఈ సమయంలో, మన రక్షణ ప్రణాళికలు చెదిరిపోతున్న ఈ తరుణంలో మన ఆశలు అణగారిపోతున్న ఈ దుర్దినాలలో , మన
హృదయాలు ఒంటరి తనాన్ని అనుభవిస్తున్న ఈ క్షణంలో "ధైర్యముగా ఉండండి, మీ హృదయాలను తెరిచి ఉంచండి, మిమ్ము ఓదార్చు ఆ దేవుని దయను మీరు అనుభవిస్తారు" అని పాపు గారు అన్నారు.
ప్రపంచమంతా మ్రానికొమ్మల ఆదివారం రోజున యువతా దినోత్సవం జరుపుకుంటున్నందున, యువత కోసం పాపు గారు ప్రత్యేక సందేశం ఇచ్చారు.
మన వద్ద ఏమి లేదో ఆలోచించకుండా, మనం ఇతరులకు ఏమి చేయగలమో ఆలోచించాలి. ప్రియ స్నేహితులారా ఈ చీకటి దినాలలో వెలుగులోకి వచ్చిన నిజమైన వీరులను చూస్తున్నం. వీరికి పేరు ప్రఖ్యాతలు లేవు, డబ్బు దర్పం లేవు, కానీ ఇతరులకోసం తమ జీవితాలను అర్పించిన ఘనత వీరికి ఉంది. వారిని వారు ఇతరుకోసం సమర్పించుకున్నారు. అదేవిధంగా దేవుని కోసం ఇతరులకోసం మీ జీవితాలను సమర్పించడానికి వెనుకాడవద్దు, మీకు గొప్ప బహుమానం లభిస్తుంది అని పాపు గారు హితవు పలికారు.
ఒక కార్డినల్, సెయింట్ పీటర్స్ బసిలికా అగ్ర పీఠాధిపతితో కలిపి 30 మంది మాత్రమే ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్నారు.
ప్రపంచ యువత దినోత్సవం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ యువతకు క్రితం సంవత్సరం యువత దినోత్సవం జరిపినవాళ్లు పవిత్ర సిలువను అందజేస్తారు.
ఈ ఆనవాయితీ ని కొనసాగిస్తూ పనామా లోని యువత లిస్బన్ యువతకు పవిత్ర సిలువను అందజేయాలి, అయితే ఈ కార్యక్రమాన్ని నవంబర్ లో జరుగు క్రీస్తురాజు పండుగ నాటికి వాయిదా వేస్తున్నట్టు పూజానంతరం పాపుగారు ప్రకటించారు.
చివరిగా వ్యాధిగ్రస్తులకు, వారి కుటుంబాలకు సందేశంతో పాపుగారు తన పూజానంతరం ప్రసంగాన్ని ముగించారు.
వ్యాధిగ్రస్తులను, వారి కుటుంబాలను, నిష్పక్షపాతంగా వారికి సహాయం చేస్తున్న ప్రతివారినీ ఆత్మీకంగా మనం ఆలింగనం చేసుకుందాం. పస్కా విశ్వాసపు వెలుగులో వ్యాధిగ్రస్తులకోసం ప్రార్ధిద్దాం. వారిలో ప్రతిఒక్కరు మన ఆలోచనలలో, మన హృదయాలలో, మన ప్రార్థనలలో ఉన్నారు. అని ఆయన అన్నారు.
మనం కూడా వ్యాధిగ్రస్తులను, వారి కుటుంబాలను, వారికి సహాయం చేస్తున్న వారికోసం ఆ దేవుని ప్రార్థిద్దాం.
Article abstracted from: https://www.romereports.com/en/2020/04/06/pope-on-palm-sunday-dont-think-about-what-you-lack-but-of-the-good-you-can-do/
Add new comment