మొదటి పాపు గారైన పునీత పేతురు గారి సమాధి వద్ద ప్రార్ధనతో పునీత పేతురు గారు మరియు పునీత పౌలు గార్ల పండుగను ఫ్రాన్సిస్ పాపు గారు

St. Peter's feast  Saint Peter's feast

మొదటి పాపు గారైన పునీత పేతురు గారి సమాధి వద్ద ప్రార్ధనతో పునీత పేతురు గారు మరియు పునీత పౌలు గార్ల పండుగను ఫ్రాన్సిస్ పాపు గారు

 

మొదటి పాపు గారైన పునీత పేతురు గారి సమాధి వద్ద ప్రార్ధనతో పునీత పేతురు గారు మరియు పునీత పౌలు గార్ల పండుగను ఫ్రాన్సిస్ పాపు గారు నిన్న ప్రారంభించారు. వాటికన్ లో ఉన్న ఈ సమాధి వద్ద ఫ్రాన్సిస్ పాపు గారు ఒంటరిగా ప్రార్ధించి, ఈ పండుగను ప్రారంభించినట్లు ప్రకటించారు.

అనంతరం ఫ్యాన్సిస్ పాపు గారు దివ్య బలి పూజను అర్పించారు. ఈ పూజలో సుమారు 100 మంది పాల్గొనగా, వారు కూడా సామిజిక దూరాన్ని పాటించారు.

సనాతన చర్చి అధికారులు మరియు కాన్స్టాంటినోపుల్ ప్రతినిధులు ఈ పూజకు హాజరు కావడం ఆనవాయితీ కాగా వారు ఈ సంవత్సరం హాజరు కాలేకపోయినందుకు పాపు గారు తన విచారాన్ని వ్యక్తం చేసారు.

ఈ పూజా సమయంలో పాపు గారు గత సంవత్సరం తాను 54 మహా నగరాలలో నియమించిన అగ్ర పీఠాధిపతులకు ప్రదానం చేయబోవు వస్త్రాలను ఆశీర్వదించారు. 

అగ్ర పీఠాధిపతులందరి తరుపున కార్డినల్ గియోవన్నీ బట్టిస్తా రే ఈ పూజకు హాజరు కాగా కార్డినల్స్ కళాశాలకు ఆయనను అధికారిగా ప్రకటిస్తూ దానిని సూచించే వస్త్రాలను కూడా పాపు గారు ఆయనకు బహూకరించారు.

పాపు గారు లాక్ డౌన్ లో కూడా అంతర్జాలం ద్వారా ప్రజలకు తన సందేశాలు ఇస్తున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు. దీని ద్వారా విశ్వాసులు ఎంతో మనో ధైర్యాన్ని పొందారని, తన సందేశాల ద్వారా పాపు గారు ప్రజలకు ఎప్పుడు దగ్గరగానే ఉన్నారని కార్డినల్ గియోవన్నీ బట్టిస్తా రే అన్నారు.

"మనం ప్రార్ధన ద్వారా మన ఐక్యతను కలిగి ఉన్నామా? మన సంఘంతో ఐక్యత కలిగి ఉన్నామా? మనం మన సహోదరులకోసం ప్రార్ధిస్తున్నామా? మనం ఎక్కువగా ప్రార్ధించి, తక్కువగా విమర్శిస్తే ఏమి జరుగుతుంది? సున్నితమైన పలుకు పలికే నాలుక మనకు ఉంటే ఏమి జరుగుతుంది? " మనలో ప్రతి ఒక్కరం ఈ ప్రశ్నలను మనకు మనం వేసుకోవాలని పాపు గారు సూచించారు.

ఎటువంటి నిరాశావాదం లేకుండా, నిరీక్షణను కలిగించే శక్తిని ప్రార్ధన వలన వస్తుందని, హేరోదు రాజు చేతులలో ఎన్నో హింసలు అనుభవించిన మొదటి క్రైస్తవులను ఈ సందర్భంగా పాపు గారు గుర్తు చేసుకున్నారు.

హేరోదు రాజును ఎవరు అవమానించరు. బాధ్యులైనవారిని అవమానించడం మనకు అలవాటే. చుట్టూ జరిగే అన్యాయాలను గూర్చి, సమాజాన్ని గూర్చి, ఈ ప్రపంచాన్ని గూర్చి క్రైస్తవులు ఫిర్యాదు చెయ్యడంలో సమయాన్ని వ్యర్థం చెయ్యడం ఎంతో చిరాకు తెప్పిస్తుంది. నేను ఇప్పుడు వాళ్ళని ఏమి అనను ఎందుకంటే ఇది  సమయం కాదు. దేవుడే వారికి తీర్పు తీర్చుతాడు. కానీ మనం నాయకులందరికోసం ప్రార్ధించాలి. వారికి మన ప్రార్ధనలు అవసరం కనుక ప్రార్ధిద్దాం.

ఇటలీ లో కరోనా మహమ్మారి చేసిన బీభత్సానికి వాటికన్ లో కూడా ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

ఉదాహరణకు, ఏ చర్చి లో కూడా 200 మందికంటే ఎక్కువ విశ్వాసులను అనుమతించడంలేదు. పాపు గారి పూజకు కూడా 90 మంది మాత్రమే హాజరు అయ్యారు.

 

Add new comment

11 + 2 =