మే మాసానికి కాథోలికులకు పాపు గారి లేఖ

మే మాసానికి కాథోలికులకు పాపు గారి లేఖపాపు గారి లేఖ

మే మాసానికి కాథోలికులకు పాపు గారి లేఖ

 

మే మాసం వస్తుంది, పవిత్ర కన్య మరియ తల్లి పట్ల మన ప్రేమను, భక్తిని చూపించు పవిత్ర సమయం. మనం మన ఇళ్లలో, మన కుటుంబమంతా కలిసి జపమాలను జపించు మాసం. కరోనా వల్ల ఉన్న ఆంక్షలు కుటుంబాలను ఆత్మీకంగా దగ్గర చెయ్యడానికి దోహద పడుతుంది.

ఈ కారణం చేత, అందరు మే మాసంలో కుటుంబ సమేతంగా జపమాలను జపించి అందులోని మాధుర్యాన్ని కనుగొనాలని ప్రోత్సహిస్తున్నాను. మీకు ఉన్న పరిస్థితులని బట్టి ఒక సమూహంగా కానీ ఒంటరిగా కానీ జపమాలను జపించండి.  

మీరు ప్రతి సారి జపమాలను జపించిన అనంతరం ప్రార్ధించడానికి నేను మీకు రెండు ప్రార్ధనలు ఇస్తున్నాను. నేను కూడా ఈ మే మాసం అంతా జపమాల జపించిన అనంతరం వీటిలో ఒక ప్రార్ధన చేస్తాను. ఈ లేఖతో ఆ ప్రార్థనలను కూడా జత చేసి మీ అందరికోసం పంపుతున్నాను.

ప్రియమైన సహోదరి సహోదరులారా మరియ తల్లి హృదయంతో క్రీస్తు ప్రభుని తిరు మోమును ధ్యానించడం ద్వారా మనందరం ఒక కుటుంబమై మన కష్టాలను అధికమించగలం. నా ప్రార్ధనలో మిమ్మందరని మరి ముఖ్యంగా ఆపదలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాను. అదేవిధంగా నా కోసం మీరందరు ప్రార్ధించండని కోరుకుంటున్నాను. నా ఆప్యాయభరిత ఆశీర్వాదం మీకు అందిస్తూ మీ వందరికి నా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.

మొదటి ప్రార్ధన

ఓ మరియ తల్లి

మా జీవిత ప్రయాణంలో మా అభయంగాను, నిరీక్షణగాను ఎల్లప్పుడూ మీరు ప్రకాశిస్తూనే ఉన్నారు.
క్రీస్తు శ్రమలలో ఆయన వెంట విశ్వాసంతో కొనసాగిన మీరు
ఆయన శ్రమలలో ఆయనతో ఐక్యమైన మీకు మరియు వ్యాధిగ్రస్తుల ఆరోగ్యమైన మీకు మమ్ము అప్పగించుకొనుచున్నాము

 రోమీయుల రక్షణ అయిన మాత
మా అవసరాలు మీరు ఎరిగి ఉన్నారు
ఈ శోధన సమయంలో కానా పల్లెలో
మీరు మీ కుమారుని ద్వారా సమృద్ధిని
సంతోషాన్ని కలిగించినట్లు మాకు కూడా
సమృద్ధిని దయచేస్తారు.

క్రీస్తు మాకు చెప్పినది పాటిస్తూ
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి
మమ్ము మేము సంసిద్ధం చేసుకోనున్నట్లు
మీ దైవికమైన ప్రేమను మాకు తోడుగా నుంచండి
ఏలయన మీ కుమారుడు మా పాపాలను, అతిక్రమములను
తనపై వేసుకొని, సిలువలో మరణించెను తద్వారా
ఉత్తానములోని ఆనందాన్ని మాకు ప్రసాదించెను.

ఆమెన్

రెండవ ప్రార్ధన

దేవుని తల్లి అయిన ఓ పరిశుద్ధ మాత, మీ రక్షణకై పరుగిడి వచ్చుచున్నాము

అత్యంత బాధాకరమైన ఈ సమయంలో, యావత్ప్రపంచం శ్రమలు మరియు ఆందోళన తో సతమమౌతున్నది. ఈ సమయంలో దేవమాత అయిన ఓ మాతా, రక్షణకొఱకై మీ సారాను జొచ్చుచున్నాము.

ఓ కన్య మరయమ్మా,   కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో మీ కృపా నయనాలు మా వైపు త్రిప్పడి.  తమ స్వంత వాళ్లను కోల్పోయి బాధలోనూ, విషాదంలోనూ మునిగిఉన్నవాళ్లను ఓదార్చండి. తమ ప్రియమైన వారికోసం శ్రద్ద ఉన్నవారికి, ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తమ ప్రియమైన వారికి దూరంగా ఉండవలసివస్తున్న వారికి దగ్గరగా ఉండండి. ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన అనిశ్చిత పరిస్థితులతో ఉన్న వారందరిలో ధైర్యాన్ని నింపండి.

 దేవమాత అయిన మా తల్లీ,  

ఈ కష్టాలు అన్ని సమసిపోయి ఆ దేవుని దయ వల్ల శాంతి సమాధానాలు నెలకొనాలని మా కొరకు దయాసముద్రుడైన  ఆ పరమ తండ్రిని వేడుకొనండి. బాధితులు, వారి కుటుంబాలకు మీ కుమారుడు ఊరట కలిగించునట్లు కాన పల్లె లో మీ కుమారుని వేడిన  విధంగా వేడండి.

ఈ కరోనా  సమయంలో ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారు, వారికి తోడుగా నుండి వారి వీరోచిత సేవకు వారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి.

రేయింబవళ్లు వ్యాధిగ్రస్తులకు సహాయం చేస్తున్న వారిని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ సమయంలో విశ్వాసులకు సదా సేవ చేస్తున్న దైవజనులను, వారి పరిచర్యను ఆశీర్వదించండి.

ఓ పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, ఈ కరోనా కు మందును కనుగొనుటకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. దేశ నాయకులకు జ్ఞానాన్ని దయచేయండి, అందరు సంఘీభావముతో మెలుగుతూ కనీస ఓనరులు కూడా లేని వారికి సహాయం చేసే ఆలోచనను వారికి దయా చెయ్యండి.

పరమ పవిత్ర మరియ మాత, పాలకులు తాము ఆయుధాలు తయారు చెయ్యడానికి వినియోగించు ధనాన్ని రాబోవు కాలంలో ఇటువంటి వ్యాధులకు విరుగుడు మందు కనుగొనుటకు వినియోగించునట్లు వారి మనసులను మలచండి.

ప్రియమైన మాత, మేమందరం ఒకే కుటుంబానికి చెందినవారమని గ్రహించునట్లు చెయ్యండి. విశ్వాసంలోను, ప్రార్ధనలోను బలపడునట్లు దీవించండి.

బాధితులకు ఓదార్పైనా మరియ తల్లి, బాధలలో ఉన్న వారిని హత్తుకోండి, తండ్రి తన మహిమకర హస్తాలను చాచి ఈ మహమ్మారి నుండి మమ్ములను రక్షించి ఈ ప్రపంచం మరల సాధారణ స్థితికి వచ్చునట్లు వేడుకొనండి.

మా జీవిత యానపు చుక్కానివైన ఓ మరియతల్లి, ఓ మధురమైన కన్య మారియమ్మా,   మా జీవితాలను మీకు అప్పగించుకుంటున్నాము.

ఆమెన్ 

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/04/25/letter-of-pope-francis-to-catholics-for-the-month-of-may-2020/

Add new comment

10 + 7 =