మెదడు లోని ఆలోచనకు, హృదయంలోని స్పందనకు సంబంధం లేకుండా మనం జీవిస్తున్నాం: ఫ్రాన్సిస్ పాపు గారు

Lazar and the richLazar and the rich

మెదడు లోని ఆలోచనకు, హృదయంలోని స్పందనకు సంబంధం లేకుండా మనం జీవిస్తున్నాం: ఫ్రాన్సిస్ పాపు గారు

ఇతరుల బాధలను చూసి కూడా మన హృదయాలను మూసి ఉంచే మనస్తత్వాన్ని గూర్చి ఫ్రాన్సిస్ పాపు గారు కాసా మార్త లో గురువారం జరిగిన దివ్య బలి పూజ లో ప్రస్తావించారు.

ఎంతమంది చిన్నారులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారో, సరైన వైద్య సదుపాయాలు లేక రోగాల బారిన పడుతున్నారో, మంచి విద్యా సౌకర్యాలు లేక కష్టాలు పడుతున్నారో మనం ప్రతిరోజూ వార్తాపత్రికలలో, టీవీలలో చూస్తూనేఉన్నాం. వారిని చూసి అయ్యో పాపం అనుకుంటాం మరుక్షణం దానిని గూర్చి మర్చిపోయి మన పనిలో మనం మునిగిపోతాం. ఆ దయనీయ సంఘటనలు మన మెదడు వరకు మాత్రమే వెళ్తాయి కానీ మన హృదయాలను తాకావు. మెదడు లోని ఆలోచనకు, హృదయంలోని స్పందనకు సంబంధం లేకుండా మనం జీవిస్తున్నాం. అని పాపు గారు తన బాధను వ్యక్తం చేసారు.

ఫ్రాన్సిస్ పాపు గారి సందేశం క్లుప్తంగా....

లాజరు అబ్రాహాము తో స్వర్గలోకానికి తీసుకువెళ్ళబడ్డాడని, ధనవంతుడు భూమిలో పాతిపెట్టబడ్డాడని పవిత్ర గ్రంధంలో మనం చూస్తున్నాం. లాజరు మరియు ధనవంతుని మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడింది.

నేటి సమాజంలో కూడా మనలో మనిషి మనిషికి మధ్య అటువంటి అగాధం ఉంది. దానిని దాటడం ఎంతో కష్టతరమైన పని గా ఉంది.

ఎంతమంది చిన్నారులు ఆకలిదప్పులతో అలమటిస్తున్నారో, సరైన వైద్య సదుపాయాలు లేక రోగాల బారిన పడుతున్నారో, మంచి విద్యా సౌకర్యాలు లేక కష్టాలు పడుతున్నారో మనం ప్రతిరోజూ వార్తాపత్రికలలో, టీవీలలో చూస్తూనేఉన్నాం. వారిని చూసి అయ్యో పాపం అనుకుంటాం మరుక్షణం దానిని గూర్చి మర్చిపోయి మన పనిలో మనం మునిగిపోతాం. ఆ దయనీయ సంఘటనలు మన మెదడు వరకు మాత్రమే వెళ్తాయి కానీ మన హృదయాలను తాకావు. మెదడు లోని ఆలోచనకు, హృదయంలోని స్పందనకు సంబంధం లేకుండా మనం జీవిస్తున్నాం.

ఇటువంటి పరిస్థితి కొనసాగితే మన ఉనికికే ప్రమాదం వస్తుంది. కనుక ఇటువంటి అగాధాలు మన మధ్య తొలగించమని ప్రభువుని అడుగుదాం. ఇతరుల కష్టాన్ని చూసి అయ్యో పాపం అనడంతో సరిపెట్టకుండా, వారికీ ఏదోఒకటి చేసే దయార్ద్ర హృదయాన్ని మనకు ఇవ్వమని దేవుని వేడుకుందాం.

 

ఫ్రాన్సిస్ పాపు గారి సందేశం మేరకు మన పరిసరాలలో, మన చుట్టుపక్కల బాధలలో ఉన్నవారిని విస్మరించకుండా వారికి మన తోచిన సహాయం చెయ్యడానికి దేవుడు మన మనస్సులను తెరవాలని ఆ దేవుని ప్రార్ధిద్దాం.

Add new comment

2 + 0 =