మీ భయాలను పంచుకుంటే అవి అదృశ్యమవుతాయి- పోప్ ఫ్రాన్సిస్

మీ భయాలను పంచుకుంటే అవి  అదృశ్యమవుతాయి.. ఇటాలియన్ యువతకి పోప్ ఫ్రాన్సిస్ సూచన.

"నన్ను అనుసరించండి" అనే నినాదం తో వాటికన్ లోని సెయింట్ పీటర్స్ బసిలికా లో ప్రార్థన జాగరణను నిర్వహించారు. ఇటలీ కి చెందిన వేలాది మంది  యువతీ యువకులుకు పొప్ ఫ్రాన్సిస్ తన సందేశాన్ని అందించారు. 2 సంవత్సరాల క్రితం కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో దివ్యబలి పూజ  కాని పెద్ద ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ ప్రార్థన జాగరణను ఇటాలియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (CEI) నిర్వహించింది.

దాదాపు 100,000 మంది ఇటాలియన్ యుక్తవయస్కులు ఆలిస్ అనే అమ్మాయి తన అమ్మమ్మ చనిపోయినప్పుడు తను పడుతున్న బాధల గురించి చెప్పడం విన్నారు. మరియు తన బాధను ఇతరులకు బహుమతిగా ఎలా మార్చాలో  తాను నేర్చుకున్నట్లు తెలిపింది.
సోఫియా అనే మరో అమ్మాయి కోవిడ్-19 లాక్‌డౌన్‌ల సమయంలో తన ఒంటరితనం గురించి మాట్లాడింది.

 అనంతరం పొప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ ఎలాంటి సమయం లో నైనా నిరీక్షను కోల్పోవొద్దు అని యువతకు సూచించారు.  మీ భయాలను పంచుకోండి మరియు అవి అదృశ్యమవుతాయి అని తెలిపారు.

 

Add new comment

18 + 0 =