మిషనరీల అడుగుజాడల్లో నడవండి :పొప్ ఫ్రాన్సిస్

"నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు?" (మత్త 12:48).

సువార్తలో యేసు అడిగిన ముఖ్య ప్రశ్నలలో ఇది ఒకటి - మరియు పోప్ ఫ్రాన్సిస్ దీనిని నవంబర్ 21, 2019 న బ్యాంకాక్ యొక్క నేషనల్ స్టేడియంలోని దివ్య బలిపూజ సందర్భముగా పునరావృతం చేశారు . థాయ్‌లాండ్‌కు అపోస్టోలిక్ ప్రయాణంలో ఇది పొప్ గారి యొక్క మొట్టమొదటి బహిరంగ దివ్యబలిపూజ. “పరలోకంలో నా తండ్రి చిత్తం చేసేవాడు నా సోదరుడు, సోదరి మరియు తల్లి” అని పవిత్ర తండ్రి యేసు ఇచ్చిన అదే సమాధానం పొప్ గారు  ఇచ్చారు .

థాయిలాండ్ కాథలిక్కులను "మిషనరీ శిష్యులు" అని పేర్కొన్నారు . అందరు దేశానికి విశ్వాసాన్ని తెచ్చిన కాథలిక్ మిషనరీల అడుగుజాడలను నడవాలని సూచించారు .కొత్తదనాన్ని ఎదుర్కోవటానికి మన హృదయాలను మరియు మనస్సులను తెరవాలని  ప్రజలను  కోరారు .ఈ భూములలో మొదట అడుగు పెట్టిన మిషనరీల పరిస్థితి అలాంటిదేనని , ప్రభువు మాట వినడం ద్వారా మరియు వారు  సంస్కృతులు, ప్రాంతాలు లేదా జాతి సమూహాల ఆధారంగా చాలా పెద్ద కుటుంబంలో భాగమని వారు గ్రహించారు .ఆత్మ యొక్క శక్తితో ప్రేరేపించబడి,  సువార్త ద్వారా తెచ్చిన ఆశతో వారు  తమకు ఇంకా తెలియని కుటుంబ సభ్యుల కోసం వెతికారు  ” .కేవలం ఇద్దరు మిషనరీలు ఈ రోజు థాయ్‌లాండ్‌లో అభివృద్ధి చెందుతున్న కాథలిక్ సమాజంలో పెరిగిన విత్తనాలను నాటారని ఆయన గుర్తించారు.వేలాదిమంది ప్రజల మధ్య పొప్ ఫ్రాన్సిస్ ఈ  దివ్యపూజబలి ను ఘనముగా జరుపుకున్నారు .

Add new comment

2 + 5 =