మియన్మార్ లోని శరణార్ధులకు మన ప్రేమను చూపిద్దాం: పోప్ ఫ్రాన్సిస్

మియన్మార్పోప్ ఫ్రాన్సిస్

మియన్మార్ లోని శరణార్ధులకు మన ప్రేమను చూపిద్దాం: పోప్ ఫ్రాన్సిస్

మియన్మార్ లోని ప్రజల పట్ల తమ ప్రేమను, అక్కడి క్రైస్తవ ఆరాధనా స్థలాలను శరణార్థ స్థలాలుగా మలిచి తమ సహాయాన్ని అందించమని ఫ్రాన్సిస్ పోప్ గారు ప్రపంచానికి పిలుపునిచ్చారు.

21 జూన్ 2021 న అనుదిన ప్రార్ధన ముగిసిన తర్వాత పోప్ గారు మియన్మార్ పీఠాధిపతులను కలిసి వారితో కొంత సేపు ముచ్చటించిన అనంతరం ఆయన ప్రజలకు ఈ ప్రతిపాదన చేసారు. మియన్మార్ లోని సైన్యం ప్రభుత్వాన్ని కూలద్రోసి దేశాన్ని గత నాలుగు నెలలుగా నియంతృత్వ పాలనలో నడుపుతున్న సంగతి అందరికి తెలిసిందే.

మియన్మార్ లో శాంతిని ఆకాంక్షించు వారి హృదయాలను క్రీస్తుని తిరు హృదయం తాకి వారిని ప్రేరిపించాలని పోప్ గారు ఆశించారు. మియన్మార్ లోని క్రైస్తవులకు తన సంఘీభావాన్ని తెలుపుతూ మే నెలలో దివ్యబలిపూజను అర్పించి, మియన్మార్ ప్రజలు అందరు కలిసి కట్టుగా ఉండాలని కోరిన సంగతి మనకు విదితమే.

జూన్ 20 వ తారీఖు ప్రపంచ శరణార్ధుల దినోవత్సవం గా కొనియాడుతున్నామని ఈ సంవత్సరపు ఉద్దిష్టం "కలిసి ఎదుగుదాం, కలిసి అభ్యాసిద్దాం, కలిసి స్వస్థతనొందుదాం" అని పోప్ గారు గుర్తు చేసారు. శరణార్థులకు మన హృదయాలను తెరచి ఉంచుదాం. వాళ్ళ కష్టసుఖాలను మన కష్టసుఖాలుగా భావిద్దాం. వారి స్థితిస్థాపకత నుండి మనం కూడా ఒక మంచి పాఠం నేర్చుకుందాం" అని పోప్ గారు పిలుపునిచ్చారు.
 

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

3 + 10 =