మరియతల్లిని ప్రార్థనకు ప్రతిరూపంగా, మన ప్రార్ధనా జీవితానికి ఆదర్శంగా తీసుకోవాలి

Mother Mary's Prayerనేను ప్రభువు దాసురాలను, ఆయన చిత్తము చొప్పున నాకు జరుగును గాక

మరియతల్లిని ప్రార్థనకు ప్రతిరూపంగా, మన ప్రార్ధనా జీవితానికి ఆదర్శంగా తీసుకోవాలి : పోప్ ఫ్రాన్సిస్ 

బుధవారం ఉదయం విశ్వాసులకు తన సందేశంలో ఫ్రాన్సిస్ పోప్ గారు ప్రార్ధన గురించిన సత్యోపదేశ సందేశాన్ని కొనసాగించారు. మరియ తల్లి తన జీవితం ద్వారా ఏ విధంగా క్రైస్తవత్వానికి మరియు ప్రార్థనకు మాతృకగా నిలిచారో ధ్యానించారు.

ఆ తల్లి అనుక్షణం వినయ మనస్కురాలై ప్రార్ధించేదని, దేవుడు ఆమెను ఎక్కడికి నడిపించినా పూర్ణ హృదయంతో దేవుని చిత్తాన్ని ఆమె స్వాగతించారని, అనేక క్లిష్ట పరిస్థితులలో ప్రార్ధన ద్వారా క్రీస్తుకు సన్నిహితంగా ఆమె ఉన్నారని పోప్ గారు గుర్తు చేసారు.

దేవుని చిత్తాన్ని విశాల హృదయంతో స్వాగతించే ఈ ప్రార్ధనా పద్దతిని కథోలికులు అందరు అనుసరించాలని పోప్ గారు ఆకాంక్షించారు.

ఫ్రాన్సిస్ పోప్ గారి సందేశం (క్లిప్తంగా)

ప్రార్ధనను గూర్చిన మన సత్యోపదేశ సందేశాలలో నేడు మనం మరియతల్లి ప్రార్ధనా విధానాన్ని గూర్చి ధ్యానించుకుందాం. మరియతల్లిని ప్రార్థనకు ప్రతిరూపంగా, మన ప్రార్ధనా జీవితానికి ఆదర్శంగా తీసుకోవాలి. యుక్త ప్రాయం నుండి ఆమె వినయ పూరిత హృదయంతో ప్రార్ధించారు. తండ్రి ఆమెను ఎక్కడకు నడిపించినా పూర్ణ హృదయంతో దానిని స్వాగతించారు. 

దైవ కుమారునికి తల్లి కాబోతున్నదని గాబ్రియేల్ దూత ఆమెకు చెప్పిన సమయంలో కూడా ఆమె ప్రార్ధనలో ఉన్నారు. ఆ సమయంలో "నేను ప్రభువు దాసురాలను, ఆయన చిత్తము చొప్పున నాకు జరుగును గాక " అను మాటలు మనకు ఆదర్శం కావలి. దేవుని చిత్తాన్ని స్వాగతించే మనసు కలిగి ఉండే ప్రార్ధన మనకు ఆదర్శం కావలి. 

క్రీస్తు ప్రభుని జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితులలో చివరకు క్రీటు ప్రభువు సిలువ శ్రమలు అనుభవిస్తున్న సమయంలో కూడా మరియ తల్లి తన ప్రార్ధన ద్వారా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు.  క్రీస్తుని పునరుత్తాన సంతోషములో  మరియ తల్లి ప్రార్ధనాపూర్వకంగా ఆయనకు సహకారాన్ని అందించారు. పవిత్రాత్మ శక్తిని విశాల మనస్సుతో ఆహ్వానించిన మరియతల్లి దేవునికే కాక సమస్త కథోలిక సమాజానికి తల్లిగా నిలిచింది. పునీత లూకా గారు చెప్పినట్లు "మరియ తల్లి అంతయు తన మనస్సున పదిల పరచుకొని మననము చేయుచుండెను" (లూకా 2 : 19 ). ఆ మరియతల్లి నిష్కల్మష హృదయంతో మన హృదయాలను ఐక్యపరచి మన ప్రార్ధనల ద్వారా దేవుని చిత్తాన్ని మన జీవితాలలో స్వాగతించే విధంగా మన మనసులను మలచుకుందాం.

ఈ నవంబర్ మాసంలో వ్యాధిగ్రస్తులైన మన ఆప్తుల కోసం ప్రార్ధిద్దాం. మరిముఖ్యంగా మరణం ద్వారా మనకు దూరమైన వారిపై దేవుడు తన దయను కురిపించి వారి ఆత్మలు పరలోక ప్రాప్తి పొందినట్లుగా ఆ తండ్రిని వేడుకుందాం. ఆ దేవాదిదేవుని సంతోష సమాధానాలు మీ పై మీ కుటుంబాలపై ప్రోక్షింప బడును గాక. ఆమెన్ 

Add new comment

6 + 2 =