Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
మరణావస్థలో ఉన్నవారికి సహకరించి వారిని సాగనంపాలి
విశ్వాసులకు తన సందేశంలో మరణాన్ని గురించి క్రైస్తవ దృక్పధాన్ని వివరించి రెండు రకాల అతీతమైన ఆలోచనా పద్దతులను నివారించాలని కోరారు.
నిరంతరం మందులు వాడుతూ మరణాన్ని వెనకకు తోసే ప్రయత్నం చెయ్యడం మరియు ఉన్న అస్వస్థతకు మందులు వాడకుండా జీవితాన్ని మరణదశకు తీసుకుపోవడం.
మరణావస్థలో ఉన్నవారికి సహకరించి వారిని సాగనంపాలి. అలాగని ఆత్మ హత్య చేసుకునేవారికి సహకరించకూడదు. జీవితం ఒక హక్కు, మరణం కాదు. మరణాన్ని స్వాగతించాలి కానీ బలవంతంగా దానిని మనం చేరుకోకూడదు. ఇది క్రైస్తవులేకాదు అందరు తెలుసుకోవలసిన ఒక సత్యం.
సంతోషకర మరణానికి పోషకులు పునీత యోసేపు గారు అని, క్రైస్తవులు విశ్వసించే నిత్యజీవానికి ఆయన ఉదాహరణ అని పాపు గారు గుర్తు చేసారు.
పునరుత్థానము లోని విశ్వాసము వల్లనే మరణ భయాన్ని అధికమించగలం. అంతేకాదు మరణానికి ఒక మంచి అర్ధాన్ని ఇవ్వగలం. నిజానికి క్రీస్తు జీవిత రహస్యం ద్వారా మనం మరణాన్ని క్రొత్త కోణంలో చూడగలం అని పాపు గారు అభివర్ణించారు.
మరణాన్ని గూర్చి ధ్యానించడం ద్వారా మనం జీవితాన్ని నూతన దృక్పధంతో చూడగలం అని పాపు గారు అభిప్రాయపడ్డారు.
మనం ఎదో ఒక రోజు మరణిస్తామని గ్రహించనప్పుడు మన సహోదరులతో విభేదాలు కలిగిఉండడం నిరర్ధకం. అందరితో సమాధానంతో ఉండి మరణాన్ని చేరడం చాల ఉత్తమం అని పాపు గారు అన్నారు.
వ్యాధులతో బాధపడుతున్నవారు సరైన వైద్య సదుపాయాన్ని మరియు ఆత్మీక ఆప్యాయతను పొందాలని కోరుతూ పాపు గారు తన సందేశాన్ని ముగించారు.
Add new comment