మన హృదయాలను దహించి గాయాలను మాన్పె శక్తి గల వాడు దేవుడు ఒక్కడే

corpus christi 2020corpus christi 2020

మన హృదయాలను దహించి గాయాలను మాన్పె శక్తి గల వాడు దేవుడు ఒక్కడే 

 

గాయక బృందం వారి సుమధుర గానాల మధ్య ఫ్రాన్సిస్ పాపు గారు పేతురు గారి ఆసనం ఉన్న పీఠం వద్దకు ఊరేగింపుగా వెళ్లారు.

కార్పస్ క్రిస్టి పూజకు సుమారు 50 మంది హాజరు కాగా, అందరు మాస్కులు ధరించారు. ఈ పూజలో మానవుల పట్ల దేవుని ప్రేమకు చిహ్నంగా వెలసిన దివ్య సత్ప్రసాదాన్ని గూర్చి పాపు గారు ధ్యానించారు. ఈ సత్ప్రసాదము మూడు రకాల రుగ్మతలను నిర్ములిస్తుందని ఆయన అన్నారు.

మొదటిది: ఆదరణ లేమి వలన కలిగే బాధను నివారిస్తుంది.

"మనల్ని ప్రేమించే వారు లేక, మన పట్ల ఆదరణ చూపవలసిన వారు మనల్ని విస్మరించిన సందర్భాలు, మన హృదయాలు ఆనాధలుగా అనిపించిన సమయాలు మన జీవితాలలో చూసివుంటాం. వెనకకు వెళ్లి మన గతాన్ని మార్చుకోవాలని అనిపించవచ్చు కానీ దేవుడు మన గాయాలను మాన్పుతాడు."

రెండవది: అవమానము 

"ఇంట్లోనూ, పని వద్ద కూడా మనం మన కలలను సాకారం చేసుకునే ప్రక్రియలో ఎన్నో సార్లు అవమానాలు, ఓటములు, కష్టాలు మరియు ఇబ్బందులు చవిచూస్తాం. అవి మనలను కృంగదీయవు ఎందుకంటే మన హృదయాంతరాలలో క్రీస్తు ప్రభువు తన ప్రేమతో మనలను ప్రోత్సహిస్తూనే ఉంటారు."

మూడవది మరియు చివరిది: సంకుచితత్వం 

"మనలోని సంకుచితత్వం నశించినప్పుడు మనం మన సౌకర్యవంతమైన జీవిత శైలి  నుండి సహాయం చేసే స్థాయికి చేరుతాం. మనం ఎప్పుడు తీసుకునే వారం కాదని, మన చేతులు ఇతరులకు దానం చెయ్యడానికి కూడా ఇవ్వబడ్డాయని గ్రహిస్తాం." 

పూజానంతరం ఆనవాయితీగా చేస్తున్న ప్రదక్షిణం చెయ్యకుండా, అందరు కొంతసేపు మౌనంగా సత్ప్రసాద ఆరాధన చేసారు. అనంతరం పాపు గారు తల్లి మరియ వద్ద కొంత సేపు ప్రార్ధించారు. 

ఇటలీలో కరోనా నిబంధనలు సడలించి ఆదివారాలు పూజలు చేయొచ్చు అని ఉత్తరువులు జారీ చేసిన విషయం విదితమే, అయినా రోము నగరంలో ఇంకా సామూహిక కార్యక్రమాలకు అనుమతించడం లేదు a

Add new comment

2 + 13 =