మన సెల్ ఫోన్లను పక్కన పెట్టి ప్రకృతిని ఆస్వాదించాలి

Natureప్రకృతిని ఆస్వాదించాలి

మన సెల్ ఫోన్లను పక్కన పెట్టి ప్రకృతిని ఆస్వాదించాలి

శస్త్రచికిత్స అనంతరం 18 జులై 2021 న ఫ్రాన్సిస్ పోప్ గారు విశ్వాసులను మొదటి సారి కలిశారు. శస్త్రచికిత్స కారణంగా ఆయన కొంచం బలహీనంగా కనిపించారు. బలహీనతను కూడా లెక్కచెయ్యకుండా ఆయన విశ్వాసులను కలిసి తన సందేశాన్ని ఇచ్చారు. ఆయనను సందర్శించడానికి వచ్చిన విశ్వాసులలో క్యూబా దేశం నుండి వచ్చిన కొందరు విశ్వాసులు ఆయన దృష్టిలో పడ్డారు. వారిని చుసిన వెంటనే క్యూబా లో జరుగుతున్న నిరసనలు ఆయనకు జ్ఞప్తికి వచ్చాయి.

"క్యూబా దేశంలో బాధలు పడుతున్న వారికి మరి ముఖ్యంగా నిరసనల వల్ల నష్టపోయిన కుటుంబాలకు నేను ఆత్మీయంగా నిరంతరం దగ్గరగానే ఉంటాను. క్యూబాలో చర్చల ద్వారా శాంతి మరియు సమాధాం కలగాలని నేను ఆశిస్తున్నాను" అని పోప్ గారు ఆశించారు.

అనంతరం జర్మనీ, బెల్జియం మరియు నెథర్లాండ్స్ లో 200 మందిని బలిగొన్న తుఫాను గూర్చి పోప్ గారు ప్రస్తావించారు. 

తుఫాను వల్ల వ్యాధి బాధలు అనుభవిస్తున్న వారిని ఆ దేవుడు కరుణించి తన ప్రేమను వారిపై  కురిపించాలని, నష్టపోయిన వారికి సహాయం చేస్తున్న వారికి దేవుడు మరింత బలాన్ని ఇచ్చి వారు ఇంకా ఎక్కువ మందికి సహాయం చేసేలా దేవుడు చెయ్యాలని పోప్ గారు ఆకాంక్షించారు. 

చివరిగా విశ్రాంతి దినాల గురించి పోప్ గారు వివరించారు. మన హడావుడి జీవితం నుండి కొంత సమయం విరామం తీసుకోవాలని, మన దైనందిన జీవితంలో కొంత సమయం విశ్రాంతికి కూడా కేటాయించాలని పోప్ ఫ్రాన్సిస్ గారు హితవు పలికారు. 

మన సెల్ ఫోన్లను పక్కన పెట్టి ప్రకృతిని ఆస్వాదించాలని, దేవుని గూర్చి, ఆయన చేసిన అద్భుతాలను గూర్చి ధ్యానించడానికి మనం కొంత సమయం కేటాయించాలని పోప్ గారు విశ్వాసులకు అభ్యర్ధన చేసారు.

 

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

2 + 1 =