మన విశ్వాసాన్ని దృఢపరచడమే పవిత్రాత్మ పని: ఫ్రాన్సిస్ పాపు గారు.

holy spiritవిశ్వాసాన్ని దృఢపరచడమే పవిత్రాత్మ పని

మన విశ్వాసాన్ని దృఢపరచడమే పవిత్రాత్మ పని: ఫ్రాన్సిస్ పాపు గారు.

క్రైస్తవులు విశ్వాసంలో ఎదిగేలా పవిత్రాత్మ చేస్తుందని పాపు గారు తన అనుదిన సందేశంలో వివరించారు.

పవిత్రాత్మ యొక్క పాత్ర ఇదే. తప్పులు చెయ్యకుండా క్రీస్తుని మార్గాలను ఎలా అనుసరించాలో పవిత్రాత్మ మనకు పవిత్రాత్మ నేర్పిస్తుంది. ఎందుకంటే క్రీస్తుని మార్గాలు అనంతమైనవి వాటిని సరైన మార్గంలో అర్థంచేసుకోవడం పవిత్రాత్మ వల్లనే సాధ్యం అని పాపు గారు అన్నారు.

జీవితమంతా దేవుడు మనకు ఏమి చేసాడో జ్ఞాపకం ఉంచుకోవడానికి పవిత్రాత్మ తోడ్పడుతుంది.

పాపు గారి సందేశం (క్లుప్తంగా)

ఎవరైతే నా మాటను పాటింతురో వారిని నా తండ్రి ప్రేమించును, నేను మరియు నా తండ్రి వారి మధ్యన నివసింతుము. నన్ను ప్రేమించని వారు నా పలుకు ఆలకించరు, అయినను ఆ పలుకులు నన్ను పంపిన నా తండ్రి పలుకులే కానీ నావి కావు. నేను మీతో ఉన్న సమయంలో మీకు ఈ విషయమును తెలియజేసితిని. నా తండ్రి నా నామమున పంపు పవిత్రాత్మ మీకు అన్నిటిని ఎరుక పరచి నేను మీకు చెప్పిన విషయాలను మీకు గుర్తు చేస్తుంది.

ఇది మనకు మన జీవిత ప్రయాణంలో తోడుగా ఉండుటకు తండ్రి కుమారులు పంపు పవిత్రాత్మ యొక్క ప్రమాణం.

మనం విశ్వాస రహస్యంలోనికి ప్రవేశించాలని ఈ పవిత్రాత్మ మనకు నేర్పిస్తుంది. ఆ రహస్యాన్ని అర్ధం చేసుకోవడానికి పవిత్రాత్మ మనకు తోడ్పడి, ఎటువంటి తప్పులు లేకుండా క్రీస్తుని మార్గాలను అర్ధం చేసుకోవడానికి తోడ్పడుతుంది.

తండ్రి మార్గాలను అర్థంచేసుకోవడం ఒకే పద్దతిలో ఉంటుంది. ఆ రహస్యాలను అర్ధం చేసుకోవడానికి పవిత్రాత్మ మనకు తోడ్పడుతుంది.

మనం అర్ధం చేసుకొనే కొలది ఆ రహస్యం ఒక వృక్షం వాలే  విశాలంగా, పెద్దగా  ఎదిగి అధిక ఫలాలను ఫలిస్తుంది కానీ దాని గుణం ఎప్పటికి ఒకేలా ఉంటుంది.

తండ్రి మార్గాలు విశాలం అవుతూనేఉంటాయి. అవి విశాలం అవడానికి ఆత్మ ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. తద్వారా క్రీస్తు మనకు బోధించినది అర్ధం కావడానికి దోహద పడుతుంది.

క్రీస్తు మనకు బోధించినది జ్ఞాపకం ఉండునట్లుగా పవిత్రాత్మ చేస్తుంది. పవిత్రాత్మ ఒక జ్ఞాపకం వంటిది, అది మనలను మేల్కొలుపుతుంది, తండ్రి విషయాల యందు మనల్ని మేల్కొలుపుతుంది. మనకు మన జీవితాలను గుర్తు చేస్తుంది. మనకు రక్షణను జ్ఞాపకం చేస్తుంది, మన జీవిత ప్రయాణాన్ని జ్ఞాపకం  చేస్తుంది. ఏది మంచిది? ఏది చెడ్డది? మనం నడువవలసిని మార్గం ఎదో మనకు  చూపిస్తుంది.

జ్ఞాపకాల మార్గంలో పవిత్రాత్మ మనలను నడిపిస్తుంది. పెద్దవైనా, చిన్నవైనా, మన అనుదిన నిర్ణయాలలో పవిత్రాత్మ మనకు తోడుగా ఉంటుంది. మనకు అన్ని నేర్పిస్తుంది.

తండ్రి ఇచ్చే వరం పవిత్రాత్మ. యోహాను సువార్తలో చెప్పబడినట్లు, " నేను మిమ్ము ఒంటరి గా వదలను, మిమ్ము విడువకుండా మీకు తోడు గా ఉండు ఒక సాంత్వనీకుని మీకు తోడుగా ఇస్తాను".  

బాప్తిస్మములో మనము పొందిన వరాన్ని మనం జాగ్రత్తగా భద్రపరచుకొనునట్లు ఆ తండ్రి మనకు సహాయపడును గాక.

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/05/11/pope-holy-spirits-role-is-to-teach-develop-our-faith/

Add new comment

8 + 9 =