మనం బాప్తిస్మము పొందిన రోజును ఒక పండుగలా కొనియాడాలి

బాప్తిస్మముపోప్ ఫ్రాన్సిస్

మనం బాప్తిస్మము పొందిన రోజును ఒక పండుగలా కొనియాడాలి - పోప్ ఫ్రాన్సిస్

10 జనవరి 2022 న తన సందేశంలో ఫ్రాన్సిస్ పాపు గారు ఖజాగిస్తాన్ లోని ప్రస్తుత పరిస్థిని గూర్చి తన ఆందోళనను వ్యక్తం చేసారు. అక్కడ ఇంధనం ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అనేక మంది నిరసన వ్యక్తంచేస్తుండగా వారిని అణచివేయడానికి ప్రభుత్వం పొరుగు దేశమైన రష్యా ను సాయం కోరడం, ఫలితంగా రెండు వందల మంది మరణించడం అనేక మంది తీవ్రంగా గాయ పాడడం జరిగింది.

మరణించిన వారి కొరకు మరియు వారి కుటుంబాల కొరకు నేను ప్రార్ధిస్తున్నాను. శాంతియుత చర్చల ద్వారా ప్రశాంత వాతావరణం నెలకొనాలని, ఖజాగిస్తాన్ ప్రజలను మరియతల్లి సంరక్షణకు అప్పగిస్తున్నాను అని పాపు గారు ప్రార్ధించారు.

క్రీస్తు బాప్తిస్మ పండుగ సందర్భముగా క్రైస్తవులందరూ బాప్తిస్మము గూర్చి ధ్యానించాలి ఆయన కోరారు.

మనలో ప్రతి ఒక్కరం మన బాప్తిస్మ తేదీని గుర్తు చేసుకొని ఆ రోజును ఒక పండుగలా జరుపుకోవాలని పాపు గారు పిలుపునిచ్చారు.

క్రీస్తు బాప్తిస్మ రోజును అందరు ధ్యానించి, ఆయన ఎంతగా ప్రార్ధించారో గుర్తించాలని విశ్వాసులకు పాపు గారు సందేశాన్ని ఇచ్చారు. 

Add new comment

12 + 2 =