Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
మనం ఎన్నుకొనబడ్డాం కనుకనే క్రైస్తవులము అయ్యాం
మనం ఎన్నుకొనబడ్డాం కనుకనే క్రైస్తవులము అయ్యాం
కాసా శాంటా మార్త నుండి ఫ్రాన్సిస్ పాపు గారు తన సందేశంలో మనం దేవునిచే ఎన్నుకొనబడినవారమని, మనం దేవునితో విశ్వాసము యొక్క ఒడంబడిక చేసుకోవాలని ఆయన అన్నారు.
మనలో ప్రతి ఒక్కరు ఎన్నుకొనబడిన వారే. ఎన్నో మతాలు ఉన్నా, మనం క్రైస్తవులము కాగలిగాము అంటే అది మన ఎన్నిక కాదు, ప్రభువే మనలను ఎన్నుకున్నారు. మనం ఎన్నుకొనబడ్డాం కనుకనే క్రైస్తవులము అయ్యాం. ఈ ఎన్నికలో ఒక ఒడంబడిక ఉంది. అదే నిరీక్షణ యొక్క ఒడంబడిక. విశ్వాసానికి చిహ్నము. అని పాపు గారు ప్రభోదించారు.
మనం బాప్తిస్మము పొందినతమాత్రాన క్రైస్తవులము అయిపోమని, తండ్రి తో ఒడంబడిక కలిగి ఉండి జీవించడం మరియు ఆయన ప్రతిపాదనకు ఆమోదం చూపడంలోని ఆవశ్యకతను గూర్చి ఆయన వివరించారు.
ప్రభువు ఒకే ఒక్కటి మర్చిపోతాడు. అవి మన పాపలు. వాటిని మర్చిపోయాక మరల అవి ఆయనకు గుర్తుండవు. ఈ ఒక్క విషయం తప్ప దేవుడు మరే విషయాలను మర్చిపోడు. ఆయన తన వాగ్దనాలను మరిచిపోడు. అబ్రాహామును ఇచ్చిన వాగ్దానము నుండి అన్నిటిని నెరవేర్చాడు అని చెప్పారు.
దేవుడు అబ్రాహామును ఎన్నుకొనినప్పుడు అతనిని రాజ్యాలకు తండ్రి గా చేస్తానని వాగ్దనం చేసాడు. అబ్రాహాము తన పట్ల విశ్వాసము కలిగి ఉండాలని తండ్రి దేవుడు ఒడంబడిక చేసుకున్నాడు. ఈ నాడు తండ్రి మనతో కూడా మన క్రైస్తవ జీవితానికి సంబంధించి ఒక ఒడంబడిక చెయ్యదలుస్తున్నారు. ఎన్నుకొనబడిన వారమై తండ్రికి చేసిన ప్రమాణాల పట్ల సంతోషిస్తూ, విశ్వసనీయతతో తండ్రి తో ఒడంబడిక చేసుకుందాం అని ఆయన ప్రభోదించారు.
Article abstracted from: https://www.romereports.com/en/2020/04/02/pope-at-santa-marta-each-of-us-is-chosen/
Add new comment