మనందరం పట్టుదలతో ప్రార్ధించాలి: ఫ్రాన్సిస్ పాపు గారు

జీవితానికి ఒక అర్ధం వెతికే వారు ఎవరైనా ప్రార్థిస్తారుపట్టుదలతో ప్రార్ధించాలి

మనందరం పట్టుదలతో ప్రార్ధించాలి: ఫ్రాన్సిస్ పాపు గారు

సామాన్య ప్రజలకు తన సందేశంలో పాపు గారు "ప్రార్ధన" అనే అంశం పై ధ్యానించారు. ప్రార్థన అనేది విశ్వాసానికి ఊపిరి వంటిది,  దేవుని విశ్వసించు వారి హృదయాల నుండి వెలువడు ఆవేదన ప్రార్థన అని పాపుగారు అన్నారు.

క్రైస్తవులే కాదు, జీవితానికి ఒక అర్ధం వెతికే వారు ఎవరైనా ప్రార్థిస్తారు. కనుక మనందరం పట్టుదలతో ప్రార్ధించాలి. మరి ముఖ్యంగా శోధన సమయంలో పరిపూర్ణ విశ్వాసంతో తండ్రికి ప్రార్ధించాలి"

పాపు గారి సందేశం (క్లుప్తంగా)

ప్రియమైన సహోదరి సహోదరులారా

నేటి నుండి మన సత్యోపదేశం ప్రార్థన అను అంశం గూర్చి కొనసాగుతుంది. ప్రార్థన అనేది విశ్వాసానికి ఊపిరి వంటిది,  దేవుని విశ్వసించు వారి హృదయాల నుండి వెలువడు ఆవేదన ప్రార్థన. ఇది యెరికో పట్టణములోని గుడ్డి బిచ్చగాడైనా బర్తిమయి వృత్తాంతంలో గమనించగలం. గుడ్డివాడైనా, క్రీస్తు ప్రభువు ఆ మార్గంలో వస్తున్నారని తెలిసి ఆయన కోసం పట్టు విడువకుండా "దావీదు కుమారా, క్రీస్తు ప్రభువా నా మీద దయ చూపండి" అని అయన కోసం బిగ్గరగా అరవనారభించాడు.

"దావీదు కుమారా" అని పిలవడం ద్వారా  బర్తిమయి మెస్సయ్య అయిన క్రీస్తు ప్రభువు దృష్టిని ఆకర్షించాడు. వెంటనే క్రీస్తు ప్రభువు బర్తిమయి ని దగ్గరకు పిలిచి అతనికి ఏమి కావాలని అడిగారు. దానికి అతను తనకు మరలా చూడడానికి చూపును దయచెయ్యమని అడిగాడు. అందుకు క్రీస్తు ప్రభువు "నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరచింది, వెళ్లుము" అని చెప్పారు. దేవుని దయను, శక్తిని ఆకర్షించే రక్షణ ఆర్తనాదమే విశ్వాసం అని ఈ సంఘటన ద్వారా మనకు స్పష్టమౌతుంది.

క్రైస్తవులే కాదు, జీవితానికి ఒక అర్ధం వెతికే వారు ఎవరైనా ప్రార్థిస్తారు. మన ఈ విశ్వాస ప్రయాణంలో బర్తిమయి వలె పట్టుదలతో ప్రార్ధించాలి. మరి ముఖ్యంగా శోధన సమయాలలో పరిపూర్ణ విశ్వాసంతో "క్రీస్తువా మా మీద దయగా నుండండి" అని అడగాలి.

మీ పై, మీ కుటుంబాల పై ఉత్థాన క్రీస్తుని శక్తి, సంతోషాలు ప్రోక్షింపబడును గాక. దేవుడు మిమ్ము దీవించును గాక.

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/05/06/pope-begins-new-catechesis-on-prayer-during-general-audience/ 

Add new comment

15 + 4 =