మతపరమైన భద్రత కోరుకునేవారు తమ జీవితాలలో పవిత్రాత్మ కార్యాలను నివారించినట్లే

Pope messageపోప్ ఫ్రాన్సిస్

మతపరమైన భద్రత కోరుకునేవారు తమ జీవితాలలో పవిత్రాత్మ కార్యాలను నివారించినట్లే

బుధవారం జరిగిన విశ్వాసుల సందర్శనా కార్యక్రమంలో ఫ్రాన్సిస్ పాపు గారు విశ్వాసాన్ని గూర్చి ప్రసంగించారు.

మొట్టమొదటి క్రైస్తవ సంఘాలలో ఒకటైన గలతీయుల సంఘంలో జరిగిన పొరపాట్లను ఫ్రాన్సిస్ పాపుగారు వివరించారు. దేవునితో బాంధవ్యం కంటే మతపరమైన భద్రతకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చారని అన్నారు. నేడు కూడా అనేకమంది పూర్ణ హృదయముతో సజీవుడైన నిజ దేవుని ప్రేమించుట కంటే ఆచారాలను అనుసరించుటలో మౌలిక వాదులుగా ఉంటున్నారని ఆయన అన్నారు.

మతపరమైన భద్రత కోరుకునేవారు తమ జీవితాలలో పవిత్రాత్మ కార్యాలను నివారించినట్లే అని అభిప్రాయపడ్డారు. ఆ విధమైన భద్రతను కోరుకునేవారు చివరకు చిన్న చిన్న సంఘాలుగానే మిగిలిపోతారని, వారు తమ జీవితాలలో పవిత్రాత్మ కార్యాలకు తావు లేకుండా చేస్తున్నారని అన్నారు.

గలతీయులకు వ్రాసిన లేఖలను అందరు తప్పక చదవాలని, పునీత పౌలుగారు పవిత్రాత్మ ఫలాలకు మరియు మానవ కార్యాలకు మధ్య ఉన్న వ్యత్యాసమును చక్కగా వివరించారని అన్నారు.

Article by: Arvind Bandi

Online content producer

Add new comment

12 + 5 =