భారతదేశం కొరకు ప్రార్ధించిన పోప్ ఫ్రాన్సిస్

భారతదేశం కొరకు ప్రార్ధించిన  పోప్ ఫ్రాన్సిస్
కరోనా సెకండ్ వేవ్  మరణాలతో తీవ్రంగా దెబ్బతిన్న భారతదేశ ప్రజలకు పోప్ ఫ్రాన్సిస్ తన సంఘీభావం మరియు తన సాన్నిహిత్యాన్ని తెలియజేస్తూ  కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్‌కు సందేశం పంపారు. కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సిబిసిఐ) అధ్యక్షుడుగా కార్డినల్ ఓస్వాల్డ్ గ్రాసియాస్‌ ఉన్నారు.

తన  సందేశం లో "కరోనా సెకండ్ వేవ్ తో సతమతమవుతున్న భారతదేశం కొరకు  పోప్ ఫ్రాన్సిస్ ప్రార్ధించారు. భారతదేశ  ప్రజలంతా ఈ మహమ్మారి మీద విజయం సాధించాలని, కరోనా తో బాధపడుతున్న వారికీ స్వస్థత చేకూరాలని ప్రార్ధించారు. కరోనా తో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అవిశ్రాంతంగా పని చేస్తున్న ఆరోగ్య సిబ్బంది సేవలను కొనియాడారు.

 

Add new comment

7 + 4 =