ప్రేక్షకుల వద్ద పోప్: ధ్యాన ప్రార్థన "ప్రేమ మార్గంలో పయనించటానికి ఒక మార్గదర్శి"

బుధవారం 05-05-2021 నాడు, సాధారణ  ప్రేక్షకుల వద్ద, పోప్ ఫ్రాన్సిస్ గారు,  ధ్యాన ప్రార్థనపై తన దృష్టిని కేంద్రీకరిస్తారు. మరియు ప్రేమ మార్గంలో యేసును అనుసరించడంలో ధ్యానం మనకు మార్గనిర్దేశం చేస్తుంది అని అయన తెలియచేశారు. 

రచన: డెవిన్ వాట్కిన్స్: 

ఈ వారము  ‌సాధారణ  ప్రేక్షకులతో  క్రైస్తవ ప్రార్థనపై పొప్ ఫ్రాన్సిస్ గారు  తన చర్చను కొనసాగిస్తూ, అయన ధ్యాన  ప్రార్థన గురించి లోతుగా ధ్యానిచ్చారు. ప్రతి మానవునికి “ ధ్యాన కోణం” ఉందని, ఇది  రుచినిచ్చే ఉప్పు లాంటిదని ఆయన అన్నారు. ప్రతి దినం పక్షుల కిలకిల, సూర్యుడు ఉదయించడం లేదా కళలు  మరియు సంగీతంపై మనం ధ్యానం చేయవచ్చు. "ప్రధానంగా ధ్యానించటం ఒక జీవిత విధానం కాదు, అది ఒక మార్గం" అని పోప్ అన్నారు.

ధ్యానించటం, విశ్వాసం, ప్రేమ:

ఇంకా, పోప్ ఫ్రాన్సిస్  ఇలా తెలియజేశారు,  ధ్యానించటం అనే ఈ అంశం ప్రార్థనగా మారడానికి ముందే విశ్వాసం మరియు ప్రేమలోకి ప్రవేశించాల్సిన అవసరం ఎంతో ఉంది. "ధ్యానించటం మన  కళ్ళ మీద ఆధారపడి ఉండదు, అది మనసు  మీద ఆధారపడి ఉంటుంది" అని పొప్ గారు  పేర్కొన్నారు."    దేవునితో మన సంబంధానికి ప్రార్థన 'శ్వాస'గా నిలుస్తుంది. మరియు ప్రార్థన వలనా  మనము  విశ్వాసం మరియు ప్రేమలోనికి నడిపించబడుతాము. 

ప్రార్థన మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది మరియు మన ఆలోచనలను పదునుపెడుతుంది, "వాస్తవికతను మరొక కోణం నుండి గ్రహించడానికి మనము ప్రార్థనకు అవకాశము ఇవ్వాలి" అని పోప్ గారు అన్నారు. ఆర్స్ యొక్క పవిత్ర క్యూను ఉదారంగా తీసుకుంటూ , "ధ్యానం అనేది గొప్ప విశ్వాసం అది యేసుపై ఆధారపడి ఉంటుంది." 

"ప్రతిదీ దీని నుండి వస్తుంది: స్పందించే ప్రతి హృదయం దీనిని  ప్రేమతోనే  చూస్తుంది. అప్పుడు వాస్తవికత వేర్వేరు విధానాలతో ధ్యానించబడుతుంది."

క్రీస్తు వైపు చూడటం:

సెయింట్ జాన్ వియాని గారి మాటలను  పోప్ ఫ్రాన్సిస్ గారు ప్రస్తావిస్తూ,  క్రీస్తును  ప్రేమతో ధ్యానించటానికి సాధారణమైన కొన్ని ప్రేమపూర్వక  మాటలు చాలు.  "నేను క్రీస్తు వైపు చూస్తాను మరియు అయన నన్ను చూస్తాడు!" "ఒక చిన్న చూపు చాలు," అని పోప్ అన్నారు. "మన జీవితం అపారమైన మరియు నమ్మకమైన ప్రేమతో చుట్టబడిoది  దీనినుండి మనలను ఎవరు వేరుచేయలేదు.

యేసు, తన బిడ్డలను  ప్రేమపూర్వకంగా  చూచుటలో ఒక గొప్ప నాయకుడు. యేసు ఎల్లపుడు, తన  తండ్రి దేవునితో  తన సమయాని గడపటానికి  మరియు ఆయనతో ఉండటానికి స్థలాన్ని కనుగొనేవారు. అని పొప్ గారు చేపినారు. 

పూర్వపు శోధన: 

పోప్ ఫ్రాన్సిస్ గారు  మనం శోధనలకు గురికాకుండా ఉండాలని హెచ్చరించారు. పూర్వo  కొంతమంది ఆధ్యాత్మిక గురువులు  ప్రార్థన యొక్క ఈ ద్వంద్వ అవగాహనను సమర్థించారు.

"వాస్తవానికి, యేసుక్రీస్తులో  మరియు సువార్తలో, ధ్యానం మరియు క్రియల  మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదు" అని పోప్ గారు అన్నారు. ప్రేమ మార్గంలో యేసును అనుసరించడమే సువార్తలోని గొప్ప పిలుపు అని పొప్ గారు అన్నారు. “ఇది ప్రతిదానికీ పరాకాష్ట మరియు కేంద్రంబిందువు.  ఈ కోణంలో, సేవ  మరియు ధ్యానం పర్యాయపదాలు. 

అద్భుతాలు చేయటం: 

శ్రీసభలో గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో ఒకరైనా  మరియు ధ్యాన  ప్రార్థనలో  గొప్ప వారైనా   సెయింట్  సిలువ యోహాన్ గారి  బోధనను గుర్తుచేసుకుంటూ పోప్ ఫ్రాన్సిస్ గారు తన ఉపన్యాసాన్ని ముగించారు.ఇతర పనుల కంటే,  ప్రేమతో చేసే ప్రతి చిన్న క్రియ శ్రీసభకు ఎంతో మేలు చేస్తుంది. అని పోప్ గారు అన్నారు. ఒక మంచి పని చేయాలనే ఆలోచన, కేవలం ప్రేమ నుండి మాత్రమే పుడుతుంది, అహంభావం నుండి కాదు. వినయం ద్వారా శుద్ధి చేయబడేది ఏది? రహాసంగా  మరియు నిశ్శబ్దముగా చేసే ప్రతి చిన్న సహాయం ఒక క్రైస్తవుడు  చేయ గలిగిన  గొప్ప అద్భుతం.

Add new comment

4 + 8 =