ప్రార్ధన ద్వారా దేవునికి ఎలా దగ్గర కాగలం?

దేవునికి ఎలా దగ్గర కాగలం?ప్రేమకు చిహ్నమే సిలువపై మరణించిన తన కుమారుడైన క్రీస్తు ప్రభువు

ప్రార్ధన ద్వారా దేవునికి ఎలా దగ్గర కాగలం?

గత బుధవారం విశ్వాసులకు తన సత్యోపదేశం లో ప్రార్ధన గురించి మరిన్ని విషయాలు ఫ్రాన్సిస్ పాపు గారు వివరించారు. మనంతట మనం కాక ఇంకా ఎదో "ఎక్కువ" కోసం అత్యంత ఆత్రుత కలిగి ఉండడమే ప్రార్ధన అని ఆయన అన్నారు.

ప్రార్ధనలో మనం తండ్రిని నిర్భయంగా ఒక మిత్రునిగా చేరుకోవాలని, ఎందుకంటే తండ్రి మనల్ని ఎప్పుడూ "దయతో ఆలింగనం చేసుకుంటారు". అని పాపు గారు వివరించారు.

తండ్రి యొక్క అవధులు లేని ప్రేమకు చిహ్నమే సిలువపై మరణించిన తన కుమారుడైన క్రీస్తు ప్రభువు. మన అంతం వరకు కూడా ఆ తండ్రి మనల్ని ప్రేమించడం మానరు. ప్రతి క్రైస్తవుని ప్రార్ధనలో రగులుతున్న హృదయం తామనితాము ఆ పరలోకపు తండ్రి యొక్క దయగల ప్రేమ పూర్వక హస్తాలలోకి అర్పించుకుంటుంది.

పాపు గారి సందేశం (క్లుప్తంగా)

ప్రియమైన సహోదరీ సహోదరులారా

ప్రార్ధన పై కొనసాగుతున్న మన సత్యోపదేశంలో ప్రార్ధన యొక్క ముఖ్య లక్షణాలను ఇప్పుడు మనం గమనిద్దాం. మనంతట మనం కాక ఇంకా ఎదో "ఎక్కువ" కోసం అత్యంత ఆత్రుత కలిగి ఉండడమే ప్రార్ధన. దేవుని "తండ్రి"అని పిలిచి, తండ్రితో వ్యక్తిగతంగా ఒక బాంధవ్యంలో ఉందడాలి కోరుకునే క్రీస్తు ప్రభుని తిరు ముఖములో మనం కోరుకునే ఆ "ఎక్కువ" అనేది ఉద్భవించింది.

క్రీస్తు ప్రభువు తన కాడరా భోజన సమయంలో తన శిష్యులను "ఇక దాసులని మిమ్ము పిలువనని, మీరు నా స్నేహితులని" చెప్పారు. అదే విధంగా దేవునితో మనం ప్రార్ధన ద్వారా సంభాషిస్తున్నప్పుడు మనం భయపడ వలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకు ఒక మంచి మిత్రుడు, మన సహచరుడు.

మన పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉన్నా, మన గూర్చి మనం ఎంత తక్కువగా అనుకున్నా, దేవుడు మనలను దయతో హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అవధులు లేని ప్రేమకు  సాక్ష్యం మనం కల్వరి కొండపై చూస్తాం. ఆయన చివరివరకు మనలను ప్రేమిస్తూనే ఉంటారు. దేవునితో  అనంతమైన బాంధవ్యంలోనికి ప్రవేశించడానికి మనం ప్రార్ధనను ఆశ్రయించాలి.

 ప్రతి క్రైస్తవుని ప్రార్ధనలో రగులుతున్న హృదయం తామనితాము ఆ పరలోకపు తండ్రి యొక్క దయగల ప్రేమ పూర్వక హస్తాలలోకి అర్పించుకుంటుంది.

ఉత్థాన క్రీస్తుని యొక్క సంతోషాతిశయములు మీ పై, మీ కుటుంబాలపై ప్రోక్షింపబడునుగాక 

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/05/13/pope-explains-how-to-approach-god-in-prayer/

Add new comment

4 + 0 =