ప్రార్ధన అనుకున్నంత సులువైనది కాదు: పోప్ ఫ్రాన్సిస్

Jacob Wrestlesదేవునితో యాకోబుని పెనుగులాట

ప్రార్ధన అనుకున్నంత సులువైనది కాదు: పోప్ ఫ్రాన్సిస్ 

 

సామాన్య ప్రజలకు తన సత్యోపదేశ సందేశంలో ఫ్రాన్సిస్ పాపు గారు యాకోబును గూర్చి ధ్యానించారు. రాత్రంతా దేవునితో పెనుగులాడిన సమయంలో యాకోబు యొక్క ప్రార్ధనను గూర్చి పాపు గారు ప్రసంగించారు.

"దేవునితో పెనుగులాట" ప్రార్ధన ఎంత కష్టమైనదో రుజువు చేస్తుంది. అంటే మనం మన బలహీనతలను తెలుసుకొని వాటిని దేవుని ఎదుట అంగీకరించడానికి మనతో మనం ఎంతో పెనుగులాడవలసి ఉంది.

"ఈ అంతర్గత పెనుగులాట వల్ల కలిగే గాయాలు మానడంలో ఆ దయామయుడైన దేవుని అద్భుత స్వస్థతా శక్తిని చవిచూడగలం, తద్వారా విశ్వాసంలో మరింత బలపడగలం" అని ఆయన ప్రబోధించారు.

పాపు గారి సత్యోపదేశ సారాంశము (క్లుప్తముగా)

ప్రియమైన సహోదరి సహోదరులారా,

ప్రార్ధనను గూర్చిన మన ఈ సత్యోపదేశ పరంపరలో ఇప్పుడు మనం యాకోబుని ప్రార్ధనను గూర్చి ధ్యానించుకుందాం.

ఎంతో తెలివి మరియు తన పై తనకు అపారమైన నమ్మకము కలిగిన యాకోబు తన జీవితంలో ఒకానొక సమయంలో ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో పడతాడు. తన అన్న అయిన ఏషావుకు చెంద వలసిన దీవెనలను మోసపూరితంగా తన తండ్రి అయిన ఇస్సాకు వద్ద నుండి సంగ్రహించి, తన అన్నకు భయపడి పారిపోయాడు. చాల సంవత్సరాల తర్వాత తన ఇంటికి తిరిగి వస్తుండగా ఎడారిలో ఒక రాత్రంతా ఒక అజ్ఞాత వ్యక్తి రూపంలో ఉన్న దేవునితో పెనుగులాడతాడు.

మన కథోలిక సంఘం ఈ పెనుగులాటను ప్రార్థనకు ఒక విధమైన ప్రతిరూపంగా చూస్తుంది. ప్రార్ధన సులువైనది కాదు. మనం మన బలహీనతలను తెలుసుకొని వాటిని దేవుని ఎదుట అంగీకరించడానికి మనతో మనం అంటే ఆ దేవునితో పెనుగులాడవలసి ఉంది.

ఈ అంతర్గత పెనుగులాట వల్ల కలిగే గాయాలు మానడంలో ఆ దయామయుడైన దేవుని అద్భుత స్వస్థతా శక్తిని చవిచూడగలం, తద్వారా విశ్వాసంలో మరింత బలపడగలం. మన జీవితాలలోనికి  తండ్రిని ఆహ్వానించడానికి, మన హృదయాలు పరివర్తన చెందడానికి, ఆ తండ్రి దీవెనలు మన జీవితాలలో క్రుమ్మరింపబడానికి మన హృదయాలను ఎల్లపుడు తెరచి ఉంచే విధంగా చేసే వరాన్ని ప్రసాదించమని ఆ దేవుని కోరాలి.

మీ పై మీ కుటుంబాలపై ఆ దేవుని యొక్క సంతోష సమాధానాలు క్రుమ్మరింపబడాలని ప్రార్ధిస్తున్నాను. ఆమెన్.

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/06/10/pope-reflects-on-jacob-wrestling-with-the-angel-prayer-is-not-always-easy/

Add new comment

10 + 6 =