ప్రార్ధనలో మధ్యవర్తులుగా క్రైస్తవుల బాధ్యతను గుర్తు చేసిన ఫ్రాన్సిస్ పాపు గారు

Mosesక్రైస్తవులమైన మనం కూడా, మన సహోదరుల కష్టాలకోసం ఆ దేవుని వద్ద వేసుకోవడానికి పిలువబడ్డాం

ప్రార్ధనలో మధ్యవర్తులుగా క్రైస్తవుల బాధ్యతను గుర్తు చేసిన ఫ్రాన్సిస్ పాపు గారు.

 

ఫ్రాన్సిస్ పాపు గారు ప్రార్ధన పై తన సత్యోపదేశ సందేశాలను కొనసాగిస్తూ, మోషే ను గూర్చి ధ్యానించారు. అప్పటి వారు మోషేను ఒక వైఫల్యంగా పరిగణించినా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు    తన పవిత్ర న్యాయ విధులను అందించడానికి మోషేను మధ్యవర్తిగా ఎన్నుకున్నాడు అని గుర్తు చేసారు.

క్రీస్తు కంటే ముందు వచ్చిన మోషే ప్రజల తరుపున తండ్రిని అనేక మార్లు వేడుకున్నాడు అని ప్రబోధించారు.

అవసరాలలో ఉన్న వారికోసం దేవుని వద్ద ప్రాధేయ పడడం, ప్రపంచ విముక్తి కోసం దేవుని సహాయాన్ని వేడుకోవడం వంటి ప్రార్ధనను మనం మోషే నుండి నేర్చుకోవాలి అని ఆయన అన్నారు.

పాపు గారి సందేశం సారాంశం (క్లుప్తంగా)

ప్రియమైన సహోదరి సహోదరులారా

ప్రార్ధనను గూర్చి కొనసాగుతున్న మన సత్యోపదేశ సందేశాలలో నేది మనం మోషేను గూర్చి ధ్యానించుకుందాం. ఒక వైఫల్యంగా ఐగుప్తును వీడిన మోషే తన జీవితంలో ఒకానొక సందర్భంలో ఎడారిలో  దేవుని చూడడం తటస్థిస్తుంది. ఐగుప్తునకు తిరిగి వెళ్లి తన ప్రజలను విముక్తులను చెయ్యమని దేవుడు ఒక మండుతున్న పొద నుండి మోషేను ఆజ్ఞాపిస్తాడు. కానీ అంత గొప్ప సాహసమైన పనికి తాను పనికి రానని, తాను ఒంటరిగా ఆ పని చేయలేనని తన నిస్సహాయతను తెలియ జేస్తాడు.

కానీ మోషే ద్వారానే ఇజ్రాయిల్ ప్రజలకు విముక్తిని దయచేసి, అతని ద్వారా వారికి తన పవిత్ర న్యాయ విధులను తెలియజేస్తాడు యావే దేవుడు. మోషే దేవునికి, ఇజ్రాయిల్ ప్రజలకు మధ్య ఒక మధ్యవర్తిలా ఉంటాడు. ముఖ్యంగా ఇజ్రాయిల్ ప్రజలు దేవుని సాధించిన, లేక దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినా, మోషే వారి తరుపున తండ్రి వద్ద క్షమాపణ అడిగేవాడు. ఈ విధంగా మోషే దేవునికి ఇజ్రాయిల్ ప్రజలకు మధ్య ఒక మధ్యవర్తి లాగా వ్యహరించారు. మనకు తండ్రికి మధ్య మధ్యవర్తిగా వచ్చిన క్రీస్తు ప్రభువు వాలే మోషే కూడా ఆ నాడు ఇశ్రాయేలు ప్రజలు మరియు యావే దేవునికి మధ్య ఒక వారధిగా వ్యహరించాడు. 

క్రైస్తవులమైన మనం కూడా, మన సహోదరుల కష్టాలకోసం, ఈ ప్రపంచ విముక్తి కోసం ఆ దేవుని వద్ద వేసుకోవడానికి పిలువబడ్డాం. 

మీ పై, మీ కుటుంబాలపై ఆ దేవాదిదేవుని యొక్క శాంతి సంతోషాలు ప్రోక్షింపబడాలని ప్రార్ధిస్తున్నాను. ఆమెన్ 

 

Add new comment

1 + 3 =