ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్తుడను చెయ్యి అనే చిన్న ప్రార్ధనను మనం నిత్యం జ్ఞాపకం ఉంచుకోవాలి

 Canaanite womanకనానీయ స్త్రీ కి ఉన్న విశ్వాసం మనందరిలో ఉండాలి

ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్తుడను చెయ్యి అనే చిన్న ప్రార్ధనను మనం నిత్యం జ్ఞాపకం ఉంచుకోవాలి

 

ఆగష్టు 16 న విశ్వాసులకు తన సందేశంలో కనానీయ స్త్రీ కి ఉన్న విశ్వాసం మనందరిలో ఉండాలి.  ఆ స్త్రీ తన కుమార్తె ను స్వస్తురాలిని చెయ్యమని క్రీస్తు ప్రభువును ప్రాధేయ పడటాన్ని ధ్యానించారు. ఆమెకు ఉన్న విశ్వాసం మనకు కూడా ఉండాలని ఆయన గుర్తు చేసారు.

ప్రభువా నీ చిత్తమైతే నన్ను స్వస్తుడను చెయ్యి అనే చిన్న ప్రార్ధనను మనం నిత్యం జ్ఞాపకం ఉంచుకోవాలి అని ఆయన అన్నారు.

అనంతరం ఆయన ప్రపంచంలో ఇబ్బందులకు గురి అవుతున్న దేశాలను, ప్రదేశాలను గూర్చి ప్రార్ధించారు. లెబనాన్ లోని బెలారస్ నగరాన్ని గుర్తు చేసుకున్నారు. అక్కడ ఎన్నికల తర్వాత జరుగుతున్న నిరసనలను గుర్తుచేసుకున్నారు.

ఆ దేశంలోని పరిస్థితిని నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ఎన్నికల అనంతర పరిణామాలను గమనిస్తున్నాను. ఇరువర్గాలు న్యాయానికి గౌరవం ఇచ్చి చేర్చలకు వస్తే శాంతి నెలకొనే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో కరోనా ను గూర్చి మరువవద్దని ఆయన గుర్తుచేశారు. ఈ కరోనా వల్ల ఎందరో తమ జీవనోపాధిని కోల్పోయి తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నారని ఆయన చింతించారు.

చివరిగా మరియమాత మోక్షరోహణ పండుగ సందర్భంగా విశ్వాసులందరు మరియ తల్లిని ప్రత్యేక విధంగా జ్ఞాపకం చేసుకోవాలని ఆమె సహాయ సహకారాలు నిత్యం కోరాలని ఆయన విశ్వాసులకు ప్రభోదించారు.

 

Add new comment

4 + 11 =