ప్రపంచ యువతా దినోత్సవం "సృజనాత్మకత యొక్క కవిత"  వలె  ఉండాలి

ప్రపంచ యువతా దినోత్సవంపోప్ ఫ్రాన్సిస్

ప్రపంచ యువతా దినోత్సవం "సృజనాత్మకత యొక్క కవిత"  వలె  ఉండాలి

లిస్బన్ 2023లో జరగబోయే 28వ ప్రపంచ యువతా దినోత్సవం (WYD) జీవము మరియు శక్తి తో నిండిన సృజనాత్మక కార్యక్రమంగా ఉండాలని పోప్ ఫ్రాన్సిస్ కోరుకుంటున్నారు.

మార్చి 7 న విడుదల చేసిన వీడియో సందేశంలో, పాపు గారు ప్రపంచ యువతా దినోత్సవం తప్పనిసరిగా "సజీవ సమావేశం", "సృజనాత్మకత యొక్క కవిత"  వలె  ఉండాలని మరియు యువకులందరు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు.

2023 ప్రపంచ యువతా దినోత్సవం సఫలం చెయ్యడానికి శ్రమిస్తున్న వారికోసం మరియు ప్రత్యక్షంగా మరియు డిజిటల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న వారికి పాపు గారు తన ప్రోత్సాహాన్ని తెలిపారు.

2023 ప్రపంచ యువతా దినోత్సవం ఆగష్టు 1 నుండి 6 కు పోర్చుగల్ దేశం లో జరగనున్నాయి.

ఆగస్టు 2023లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కథోలిక యువకులను కలవదానికి పాపు గారు ఎదురు చూస్తున్నానని పాపు అన్నారు.

ప్రతి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆసియా నుండి కథోలిక యువతా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.

అనేక సంక్షోభాలు ఏర్పడినందున పోర్చుగల్ మరియు వివిధ దేశాలలోని నిర్వాహకులకు 2023 ప్రపంచ యువతా దినోత్సవం కోసం సిద్ధం కావడం  అంత సులభం కాదు. మనం ఒక సంక్షోభం నుండి మరొక సంక్షోభంలోకి వెళ్లడం వల్ల ఇది అంత సులభం కాదు, ”అని పాపు గారు అన్నారు. "మనం ఒక మహమ్మారి సంక్షోభం నుండి బయటపడ్డాము, ఇంతలోనే  ఆర్థిక సంక్షోభంలోకి ప్రవేశించాము మరియు ఇప్పుడు యుద్ధ సంక్షోభంలో ఉన్నాము, ఇది ప్రపంచానికే ఒక పెద్ద సంకటం." అని పాపు గారు అభిప్రాయ పడ్డారు.

సంక్షోభాల మధ్య, పోప్ ఫ్రాన్సిస్ యువత ప్రతినిధులను “ఆగస్టు 2023 ఈవెంట్‌ను యవ్వన కార్యక్రమంగా, తాజా సంఘటనగా, జీవితంతో కూడిన సంఘటనగా, శక్తితో కూడిన సంఘటనగా, సృజనాత్మకంగా జరిగేలా సిద్ధం చేసి సహాయం చేయాలని కోరారు.
 

Add new comment

1 + 0 =