ప్రపంచమంతా యుద్ధాలను విడచి, కాల్పులు విరమించుకొని ప్రజలకు సహాయం చెయ్యాలి: ఫ్రాన్సిస్ పాపు గారు 

కరోనా బాధితులకు నేను ఆత్మికంగా చేరువలోనే ఉంటానుImage Source: Vatican News

ప్రపంచమంతా యుద్ధాలను విడచి, కాల్పులు విరమించుకొని ప్రజలకు సహాయం చెయ్యాలి: ఫ్రాన్సిస్ పాపు గారు 

 

కరోనా బాధితుల గురించి ప్రతి దినం సమాచారం తెలుసుకుంటున్న ఫ్రాన్సిస్ పాపు గారు 20 జులై 2020 నాడు ప్రజలకు తన సందేశం చివరిలో కరోనా బాధితులను ఉద్దేశించి మాట్లాడారు.

"ప్రియమైన సహోదరులారా ఈ కరోనా మహమ్మారి రోజు రోజుకు అధికమౌతున్న తరుణంలో దాని వల్ల ఆర్ధికంగా మరియు సామాజికంగా బాధింపబడుతున్న వారికి నా హృదయపూర్వక సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. వారికి ఆత్మికంగా నేను చేరువలోనే ఉంటానని హామీ ఇస్తున్నాను"అని ఆయన అన్నారు.

జాన్స్  హాప్కిన్స్ విశ్వ విద్యాలయం వారి నివేదిక ప్రకారం ఇప్పటికే కరోనా వల్ల ఆరు లక్షల పైచిలుకు ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇటువంటి సమయంలో ప్రపంచమంతా యుద్ధాలను విడచి, కాల్పులు విరమించుకొని ప్రజలకు సహాయం చెయ్యాలని పాపు గారు పిలుపునిచ్చారు.

కేయూ కాసుస్ పర్వతాలలో తాజాగా తలెత్తిన వివాదాలను గూర్చి పాపు గారు తన ఆందోళనను వ్యక్తం చేసారు. నగోరునో కార్బాఖ్ ప్రదేశాన్ని ఆక్రమించుకోవడానికి అమెరికా మరియు అజర్బేజాన్ దళాలు కాల్పులకు దిగిన విషయాన్ని గుర్తు చేస్తూ, అక్కడ మరణించిన 12 కు పైగా సైనికులకు తన సంతాపాన్ని వ్యక్తం చేసారు.

"అంతర్జాతీయ శాంతి సంఘాల జోక్యంతో ఇరు పక్షాలు చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వస్తాయని ఆశిస్తున్నాను" అని పాపు గారు తన ఆశాభావాన్ని తెలిపారు.

ఇటలీ లో కరోనా వల్ల విధించిన ఆంక్షలు సడలించినా, ప్రజలు అధికంగా ఒకే చోట చేరడాన్ని నిషేదించారు. తత్ఫలితంగా వాటికన్ లోని వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. 

 

Add new comment

3 + 3 =