ప్రపంచమంతా కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఐక్యరాజ్య సమితిని ప్రశంసించిన ఫ్రాన్సిస్ పాపు గారు.

కాల్పుల విరమణకాల్పుల విరమణ

ప్రపంచమంతా కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఐక్యరాజ్య సమితిని ప్రశంసించిన ఫ్రాన్సిస్ పాపు గారు.

 

కరోనా మహమ్మారి వల్ల జరిగిన పరిణామాల దృష్ట్యా ప్రపంచ జనావళి ఐక్యత కలిగి ఉండాలని ఫ్రాన్సిస్ పాపు గారు అపోస్తలిక రాజభవన గవాక్షం నుండి ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రపంచమంతా కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఐక్యరాజ్య సమితిని పాపు గారు ప్రసంశించారు.

భవిష్యత్తులో ప్రపంచ శాంతి కి ఇది నాంది కావాలని పాపు గారు ఆకాంక్షించారు.

ప్రపంచమంతా కాల్పుల విరమణ పిలుపును నేను స్వాగతిస్తున్నాను. మనకు నేడు అత్యవసరమైన మానవ సహకారానికి అవసరమైన శాంతి మరియు భద్రతలకు ఈ చర్య ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన అన్నారు.

ప్రార్ధన అనంతరం ఆయన ప్రజలకు ఇచ్చిన సందేశంలో మాట్లాడుతూ నేడు క్రీస్తు మంచి మనసు గల వారు గురించి మాట్లాడుతున్నారని, నవ సమాజ నిర్మాతలుగా ఎదగడానికి వారికి శక్తిని ఆయన ఇస్తారని అన్నారు.

ఈ లోకం ధనికులు మరియు శక్తి గల వారినే ఘనపరుస్తుంది. ఈ ప్రక్రియలో ఎన్నో సార్లు కొందరు వ్యక్తులను, వారి గౌరవాన్ని కూడా అణగద్రొక్కుతుంది. అణగద్రొక్కబడిన దీనులను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. దాతృత్వ కార్యాలు చేస్తూ, దీనులకు దేవుని మార్గాన్ని చూపాలన్నది మన కథోలిక విశ్వాసం మనకు ఇస్తున్న సందేశం. అని పాపు గారు ప్రబోధించారు.

తన సందేశాన్ని ముగిస్తూ దీవించబడ్డ దీనులకు క్రీస్తు ప్రభువు ఒక నిదర్శనం అని, నిజమైన జ్ఞానం హృదయం నుండి వస్తుందని, ఆలోచనలను అర్ధం చేసుకోవడం వల్ల కాదని ఆయన వివరించారు.

Add new comment

8 + 0 =