ప్రజలను గూర్చి ఆలోచించండి, ఆర్ధిక వ్యవస్థను గూర్చి కాదు: ఫ్రాన్సిస్ పాపు గారు.

Pope's messageImage source: voice of America

ప్రజలను గూర్చి ఆలోచించండి, ఆర్ధిక వ్యవస్థను గూర్చి కాదు: ఫ్రాన్సిస్ పాపు గారు.

లాక్ డౌన్ అనంతరం మొదటిసారి ఫ్రాన్సిస్ పాపు గారు ప్రజలను నేరుగా కలిసి సందేశం ఇచ్చారు

ప్రజలను చూస్తూనే పాపు గారు ఆనందంగా " నేడు స్క్వేర్ తెరిచారు , మనం ఒకరినొకరు నేరుగా చూడగలుగుతున్నాం ,  ఎంత సంతోషకరం " అని అన్నారు.

కరోనా వ్యాధిగ్రస్తులకు వైద్యం అందిస్తూ అసువులు బాసిన వైద్యసిబ్బంది వారందరికి పాపు గారు నివాళులు అర్పించారు.

"కరోనా సోకినా వారికి వైద్య సహాయం చేస్తూ వారి జీవితాన్ని త్యాగం చేసిన వైద్య సిబ్బంది వారికి,  వైద్యులకు, నర్సులకు మనం మౌనంగా ధన్యవాదాలు తప్పకుండ చెప్పాలి."అని పాపు గారు అన్నారు.

వైద్యానికి సరిపడా డబ్బు లేక బాధ పడుతున్న వారి ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అసలు పట్టించుకొనే వారే లేని అమెజాన్ ప్రజల పరిస్థితిని గూర్చి తానూ ఎంతో ఆలోచిస్తున్నానని పాపు గారు అన్నారు.

ఎందరో ప్రజలు ఈ కరోనా వ్యాధి బారిన పడ్డారు దేశీయ తెగలలో నివసిస్తున్నవారు కూడా తప్పించుకోలేక పోతారు. వైద్య సహాయం లేక ఎవ్వరు బాధ పడ కూడదు అని కోరుకుంటున్నాను. ప్రజలనుగూర్చి ఆలోచించండి కానీ ఆర్ధిక వ్యస్థను గూర్చి కాదు. ఆర్థికత కంటే ప్రజలే చాలా ముఖ్యం. అని పాపు గారు అన్నారు.

విశ్వాసులకు చిరు దరహాసంతో పాపు గారు అభివాదం చేసి "మరలా మనం ఇక్కడే కలుసుకుందాం" అన్నారు.

కరోనా దృష్ట్యా సామాజిక దూరం పాటించవలసి ఉండగా వాటికన్ పోలీస్ అధికారులు సెయింట్ పీటర్స్ స్క్వేర్ లోపలికి కొన్ని వందల మంది విశ్వాసులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. 

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/06/01/pope-asks-to-care-for-people-not-just-the-economy/

 

Add new comment

9 + 6 =