పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచానికి అసాధారణమైన ఆశీర్వాదం ఇచ్చారు

blessings pope

 పోప్ యొక్క ప్రత్యేక ఉర్బీ మరియు ఓర్బి ఆశీర్వాదం: దేవుడు మన మంచి కోసం ప్రతిదీ మారుస్తారు 

 కోవిడ్ -19 కరోనావైరస్ మహమ్మారి ముగింపు కోసం ప్రార్థన చేయడానికి పోప్ ఫ్రాన్సిస్ శుక్రవారం నగరానికి మరియు ప్రపంచానికి అసాధారణమైన ఆశీర్వాదం ఇచ్చారు. తన ధ్యానంలో, పోప్ తన శిష్యులకు యేసు చెప్పిన మాటలను మరల గుర్తు చేసారు : “మీరు ఎందుకు భయపడుతున్నారు? నమ్మకం ఉంచండి " అనే  ”పూర్తి వచనాన్ని చెప్పారు .శిష్యులు ఆయనను, “ప్రభు  మేము నశించినా మీరు పట్టించుకోలేదా?” అని అడుగుతారు.ఆ మాటలు  యేసును కదిలించాయని పోప్ అన్నారు, "ఎందుకంటే ఆయన అందరికంటే ఎక్కువగా మన గురించి పట్టించుకుంటారు  అని తెలిపారు ."కోవిడ్ -19 మహమ్మారి మనమందరం ఒకే పడవలో ఉన్నామని గుర్తుచేసింది అని  పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.

సెయింట్ పీటర్స్ బసిలికా మెట్ల నుండి పోప్ ఫ్రాన్సిస్ శుక్రవారం ప్రత్యేక ఉర్బి ఎట్ ఓర్బిని నిర్వహించారు.సాధారణంగా క్రిస్మస్ రోజు మరియు ఈస్టర్ ఆదివారం మాత్రమే ఇచ్చే ఈ ప్రత్యేక ఆశ్విర్వాదం నిన్న ఇవ్వడం జరిగినది.ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల  అనుగుణంగా ఈ అసాధారణమైన ఆశీర్వాదం జరిగింది, ఎందుకంటే ప్రపంచ జనాభాలో సగానికి పైగా కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి వారి ఇళ్లకు మాత్రమే పరిమితం చేయబడింది.

 రోమ్ కాలమాన ప్రకారం సాయంత్రం 6గంటలకు ప్రారంభించారు.వర్షం పడటంతో నిర్జనమైన సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో నిలబడి, పోప్ ఫ్రాన్సిస్ ఆధునిక కమ్యూనికేషన్ ఫేస్‌బుక్, యూట్యూబ్,టివి మరియు రేడియో,అన్ని మార్గాల ద్వారా ప్రపంచంతో మాట్లాడారు.

శతాబ్దాలుగా రోమ్ ప్రజలతో కలిసి ఉన్న రెండు చిత్రాల సమక్షంలో అతను ఈ క్లిష్టమైన దశలో ప్రపంచం కోసం ప్రార్ధించారు .మదర్  మేరీ యొక్క చిత్ర పటం ముందు సహాయకం కోసం ప్రార్ధించడం జరిగింది.మదర్ మేరీ చిత్ర పటం సాలస్ పాపులి రోమాని యొక్క పురాతన చిహ్నం. మరియు యేసు ప్రభుని అద్భుత సిలువ ముందు ప్రార్ధించడం జరిగింది.తర్వాత పోప్ దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొన్నారు మరియు తన అపోస్టోలిక్ ఆశీర్వాదం ఇచ్చారు , ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆనందం పొందే అవకాశాన్ని కల్పించారు .

 కొరోనా తో పోరాడుతున్న వైద్య సిబ్బంది ,నర్స్ , క్లీనర్లు, గురువులు , పోలీసు అధికారులు మరియు స్వచ్ఛంద సేవకులతో సహా వారి జీవితాలను పణం గా పెట్టి పోరాడుతున్నారని,వారికీ ప్రమాదం అని తెలిసిన,వారు చూపిన ప్రేమ ,తెగువ నుండి  మరియు ప్రతిస్పందించిన చాలా మంది వ్యక్తుల నుండి మేము పాఠాలు నేర్చుకోగలమని పోప్ చెప్పారు. వారందికోసం ప్రత్యేకించి ప్రార్ధించారు .

మనం కూడా ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడుతున్న వారికి  తిరిగి కోలుకునే శక్తీ వారికి ఇవ్వ్వమని ఆ దేవాది దేవుని ప్రార్దించుదాం .ఈ కరోనా అంతం కావాలని పట్టుదలతో  ప్రభువుని వేడుకొందాము .ఆమెన్ 

 

Add new comment

7 + 6 =