పొప్ ఫ్రాన్సిస్

పరిపూర్ణ జీవితానికి పాటించవలసిన సూత్రాలు

కాథోలిక సమాజానికి పోపు ఫ్రాన్సిస్ 266 పోపు గరే కాదు, తన 5 సహోదరులలో పెద్దవాడు.

నాకు కూడా ఒక కుటుంబం ఉంది. మేము ఆరుగురు సంతానం, నాకు పదహారు మంది అన్న అక్కల పిల్లలు ఉన్నారు. నా అల్లుడు ఒకరు కారు ప్రమాదం లో మరణించారు.

వేలాది మందిని కలవడం మరియు స్వానుభవం ఆయనను కుటుంబ జీవితాన్ని గూర్చిన ఒక పండితుణ్ణి చేసింది.  సాధారణమైన కానీ సూటిగా ఉండే ఆయన సలహాలు మన అనుదిన జీవితం లో ఎంతో ఉపయోగపడతాయి. ఆయన అమెరికా ప్రజలకు ఇచ్చిన సలహా ప్రపంచమంతా వ్యాపించింది అంటే అతిశయోక్తి కాదు.

మీకు ఎంత కావాలంటేయ్ అంత వాదించండి. ఇంట్లో ఎంత గొడవ అయినా కానివ్వండి కానీ సమాధాన పడకుండ మీ రోజును ముగించవద్దు. ఎప్పుడైనా.  ఐక్య రాజ్య సమితి మీ ఇంటికి వచ్చి సమాధాన పర్చ అవసరం లేదు.  ఒక చిన్న కౌగిలింత, చిన్న సంజ్ఞ చాలు. రేవు మరలా ఒక క్రొత్త రోజు.

కుటుంబ జీవితాన్ని మెరుగు పర్చుకోవటానికి, క్షమా గుణాన్ని పెంపొందించుకోవటానికి బైబిల్ కంటే గొప్ప సాధనం లేదు అని ఆయన సూచించారు.

బైబిల్ అలమారా లో పెట్టడానికి కాదు కానీ మనం చేతిలో ఉంచుకోవాలి.  ఒంటరిగా కానీ నలుగురు కలిసి కానీ దానిని రోజు తరచూ చదవాలి. భార్య భర్తలు, పిల్లలు సాయం సమయం లో ముఖ్యంగా ఆదివారాల్లో చదవాలి. ఆ విధంగా కుటుంబం దేవుని యొక్క వెలుగు మరియు శక్తి లో ముందుకు నడవగలదు.

నూతన వధూ వరులకు వైవాహిక జీవితం లోని మాధుర్యాన్ని గూర్చి వివరిస్తూ, వైవాహిక జీవితం లో ముందుకు వెళ్ళాలి అంటే పోరాడాలి అని ఆయన చెప్పారు.

ఇది ఒక కష్టతరమైన ప్రయాణం. కొన్ని సార్లు ఒడిదుడుకులు, కష్టాలు వస్తాయి. కానీ అదే జీవితం .  
 
పిల్లల తో నిండిన జీవితాన్ని ప్రోత్సహిస్తూ, భార్య భర్తలు తల్లితండ్రులు కావటానికి సాహసించాలి అని ఆయన పిలుపునిచ్చారు.

గత 10 సంవత్సరాలు గా సౌకర్యవంతమైన జీవిత విధానం వల్ల పిల్లలు లేకుండా ఉంటె బాగుండు అనే జీవితానికి అలవాటు పడ్డాం. మీరు ప్రపంచాన్ని తిరిగి రావచ్చు, మీకు ఒక పెద్ద బంగాళా ఉండొచ్చు.

 పిల్లల వల్ల కుటుంబ జీవితం కొన్ని సార్లు సంక్లిష్టమౌతుంది. అటువంటి సందర్భాలలో మనం జాగరూకులమై ఉండాలని పోపు గారు సందేశం ఇచ్చారు.

కొంత మంది యువకులు వారి పిల్ల గురించి చెప్తున్నప్పుడు, నేను వారిని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు మీ పిల్లలతో సమయం గడుపుతారా? వారు తండ్రిగారా ప్రొదున్న వారు లేవక ముందే పనికి వెళ్ళిపోతాను, రాత్రి నేను పని నుండి వచ్చే సమయానికి వారి అప్పటికే నిద్రిస్తుంటారు అని చాలామంది తండ్రులు చెప్తారు. జీవించాల్సిన పధ్ధతి ఇది కాదు.

నేటి సాంకేతిక పరికరాలను పిల్లలు దుర్వినియోగం చెయ్యడం వల్ల కుటుంబాలు వేరు పడుతున్నాయి అని పిల్లలను పోపు గారు హెచ్చరించారు.

అంతర్జాలం లో ముచ్చట్లు, సెల్ ఫోను లో ఆటలు వంటి నిరర్థకమైన వాటితో చాలా మంది పిల్లలు మరియు యువకులు  సమయాన్ని వృధా చేస్తున్నారు. వాటిని జీవితాన్ని సులభతరం చెయ్యడానికి, జీవన శైలిని మెరుగు పర్చడానికి ఉపయోగించాలి. కానీ తరచూ అవి మనల్ని తప్పు దోవ పట్టిస్తున్నాయి.

కుటుంబ జీవితానికి వృద్ధులు మూలస్థంబాలు అని, వర్తమాన తరాలపై వారి ముద్ర ఉంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.

కుటుంబం లో,  జీవితం లో, ముసలితనం లో మనవళ్లను మానవరాళ్లను హత్తుకోవటం కంటే సుందరమైనది లేదు.

ప్రార్థన, క్షమాపణ, అంకితభావం, కష్టించటం అనునవి కుటుంబ జీవితాన్ని బలపరుస్తాయి అని పోపు గారు సందేశం ఇచ్చారు.

 

Add new comment

5 + 4 =